Breaking News

వృక్షశాస్త్ర విభాగంలో వాసుదేవ్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వక్ష శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి జెల్ల వాసుదేవ్‌కు డాక్టరేట్‌ అవార్డును మంగళవారం యూనివర్సిటీ ప్రదానం చేసింది. పిహెచ్‌. డి. పరిశోధక విద్యార్థి వాసుదేవ్‌ ‘ఎపెక్ట్‌ ఆఫ్‌ బ్రాసినోస్టిరాయిడ్స్‌ అండ్‌ సాలిసిలిక్‌ ఆసిడ్‌ ఆన్‌ ద గ్రోత్‌ ఆండ్‌ మెటబాలిసమ్‌ ఆఫ్‌ అరాఖిస్‌ హైపోజియా ఎల్‌. గ్రోన్‌ ఆండర్‌ కాడ్మిమ్‌ స్ట్రెస్‌’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని బోటనీ విభాగానికి చెందిన ప్రొఫేసర్‌ బి.విద్య వర్థినీ పర్యవేక్షణలో పూర్తిచేయడం జరిగింది.

పరిశోధన పలితాలను నిపుణుల కమిటీ తనిఖీ చేసి డాక్టరేట్‌ అవార్డుకు సిపారస్‌ చేయగా మంగళవారం వక్ష శాస్త్రం విభాగంలో పిహెచ్‌. డి. పైనల్‌ వైవాను వాసుదేవ్‌ ప్రజేంటేషన్‌ ఇచ్చారు. దీనికి సబ్జెక్ట్‌ ఎక్సపర్ట్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ సీతారామారావు వ్యవహారించారు. దీనిపై ఆయన సంతప్తి చెంది డాక్టరేట్‌ అవార్డు చేయడం జరిగింది.

కార్యక్రమంలో వక్ష శాస్త్రం విభాగ అధిపతి డా. ఎ. ఎ. హాలీంఖాన్‌ , ప్రొఫేసర్‌ బి. విద్యవర్థిని, బి.ఓ.ఎస్‌. చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అరుణ, సహాయ ఆచార్యులు (సి) డాక్టర్‌ దేవరాజు శ్రీనివాస్‌, డాక్టర్‌ వి. జలందర్‌, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాగా వాసుదేవ్‌ను విసి నీతుప్రసాద్‌, రిజిష్ట్రార్‌ ప్రొఫేసర్‌ నసీంలు అభినందించారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *