Breaking News

మీ భవిష్యత్తుకు మీరే కర్త కర్మ క్రియ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవాలని వారే వారి జీవితానికి కర్త కర్మ క్రియ అని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం డిచ్‌పల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆయన ప్రార్ధన సమయానికి ముందే పర్యటించి ప్రార్థనలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మెరుగైన సదుపాయాలతో పాటు శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించడం సివిల్‌ సర్వీసెస్‌ కంటే కూడా కష్టమైందని అంత పోటీ ఉంటుందని తెలిపారు. కష్టపడి చదవడం ద్వారా భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుందని, ఇప్పుడు ఇతర వ్యాపకాలతో ఎంజాయ్‌ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందుల పాలవుతారని బోధించారు.

ఈ వయసులోనే చదువుపై నిర్లక్ష్యం లేకుండా శ్రద్ధతో కష్టపడి చదవడం ద్వారా మంచి భవిష్యత్తుకు బాటలు పడతాయని తెలిపారు. మిగతా రంగాలలో కూడా అభివద్ధికి ప్రయత్నం చేయాలన్నారు. కేవలం పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదని ప్రపంచంలో పోటీతత్వం పెరిగినందున మంచి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్ని రంగాలపై పట్టు సాధించాలని సూచించారు.

మొన్న తన నవిపేట సందర్శన సందర్భంగా అక్కడి విద్యార్థులకు 10/ 10 గ్రేడ్‌ సాధించే విద్యార్థులకు పదివేల రూపాయల బహుమతి అందించనున్నట్లు తెలిపానని మీ పాఠశాల విద్యార్థులు కూడా 10/10 గ్రేడ్‌ సాధిస్తే మీకు కూడా అదేవిధంగా బహుమతి జిల్లా యంత్రాంగం అందిస్తుందని తెలిపారు. మొబైల్స్‌, సినిమాలు, టీవీల పైననే మనసు పెట్టకుండా విద్యపై శ్రద్ధ కనబరచాలని తెలిపారు.

నేను మీలాగే జిల్లా పరిషత్‌ పాఠశాలలో తెలుగు మీడియం చదివానని తెలిపారు. మీ పాఠశాలకు మంచి మైదానం ఉన్నదని పిచ్చి మొక్కలు తొలగించి చెట్లకు నీరు పోయాలని, పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా, శుభ్రంగా చేసుకోవాలని తెలిపారు. క్రీడల కోసం అన్ని రకాల క్రీడా సామాగ్రి అందిస్తానని, బ్యాండ్‌, మంచి మైకు ఏర్పాటు చేస్తానని తెలిపారు.

280 మంది విద్యార్థులకు గాను 100 మంది విద్యార్థులు గైర్హాజరైనందుకు కారణాలు తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలన్నారు. హిందీ పండిత్‌ ఇస్మాయిల్‌ సెలవు దరఖాస్తు లేకుండా గైర్హాజరు అయినందుకు మెమో జారీ చేయాలన్నారు. విధులకు హాజరయ్యే సమయం విషయంలో కాంప్రమైజ్‌ కాబోనని తెలిపారు. గ్రామ పంచాయతీలో పర్యటించి సర్పంచ్‌తో మాట్లాడారు.

పల్లె ప్రగతిపై మంగళవారం, బుధవారం చాటింపు వేయించాలని, జనవరి 5న విరాళాల దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. కార్యక్రమాల్లో తహసిల్దార్‌ వేణుగోపాల్‌ గౌడ్‌, ఎంపీడీవో సురేందర్‌, ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్‌, సర్పంచ్‌ రాధ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *