Breaking News

Daily Archives: January 1, 2020

యువతి అదశ్యం

రెంజల్‌, జనవరి 01 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రానికి చెందిన శిరీష (19) అనే యువతి అదశ్యమైనట్లు ఎస్సై శంకర్‌ తెలిపారు. గత మూడు రోజుల నుంచి తెలిసిన బంధువుల ఇళ్ళల్లో గాలించినా ఎటువంటి సమాచారం అందకపోవడంతో యువతి తల్లి లత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్‌ తెలిపారు.

Read More »

జూడా చర్చిలో కొత్త సంవత్సర వేడుకలు

నందిపేట్‌, జనవరి 01 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సర సందర్భంగా నందిపేట్‌ మండలం లోని జూడా చర్చిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చర్చి పాస్టర్‌ సల్మాన్‌ జాషువా ఆధ్వర్యంలో పేద ప్రజలకు సుమారు 100 మందికి పైగా బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాత సంవత్సరానికి 2019 కి వీడ్కోలు చెప్తూ నూతన సంవత్సరానికి 2020 కి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కేక్‌ కట్‌ ...

Read More »

రమణారెడ్డి జన్మదిన వేడుకలు

కామారెడ్డి, జనవరి 01 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణా రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో బిజెపి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి రైల్వే స్టేషన్‌, పాత బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో పేదలకు రగ్గులు పంపిణీ చేశారు.

Read More »

కలెక్టర్‌కు శుభాక్షాంలు తెలిపిన ఆర్‌టిఐ ప్రతినిధులు

కామారెడ్డి, జనవరి 01 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను బుధవారం ఆయన కార్యాలయంలో కలుసుకొని ప్రజాసేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ – 2005 ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు నోటుపుస్తకాలు, పెన్నులు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఇందుకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంరావు, ప్రతినిధులు నారాయణ, రాజలింగం, ప్రకాశ్‌, విజయ్‌కుమార్‌, ఆనంద్‌ రాజ్‌కుమార్‌, ...

Read More »

ఆర్‌టిసి డిపోలో న్యూ ఇయర్‌ వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 01 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని టిఎస్‌ ఆర్టీసి ఒకటవ డిపోలో స్టేషన్‌ మేనేజర్‌ సోలమన్‌ ఆధ్వర్యంలో బుదవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యోగులకు స్టేషన్‌ మేనేజర్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

నిజామాబాద్‌, జనవరి 01 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ పిట్లం ఆధ్వర్యంలో బుదవారం పిట్లం మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు శివ కుమార్‌, మల్లేశం మొత్తం 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 12 మందిని ఆపరేషన్‌ నిమిత్తం బోధన్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో లయన్స్‌ ప్రతినిధులు సంజీవరెడ్డి, వేణుగోపాల్‌, రాజుసేట్‌, రమణగౌడ్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Read More »

నూతన సంవత్సర శుభాకాంక్షలు

బాన్సువాడ, జనవరి 01 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2020 లోకి అడుగుపెడుతున్న జిల్లా ప్రజలకు, శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు శుభం కలగాలని ఆయన బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.

Read More »

బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో భీమాకోరేగావ్‌ విజయదివస్‌

నిజామాబాద్‌, జనవరి 01 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమాకోరేగావ్‌ విజయ దివస్‌ను పురస్కరించుకుని బిఎల్‌ఎఫ్‌ ఆద్వర్యంలో నిజామాబాదు పూలాంగ్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిఎల్‌ ఎఫ్‌ నేత దండి వెంకట్‌ మాట్లాడుతూ భీమాకోరేగావ్‌ ఆమరుల ఆశయాల కోసం బహుజన సమాజం పునరంకితంకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.సిద్దిరాములు, టి.జేఏసీ జిల్లా చైర్మైన్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

Read More »

కలెక్టర్‌ను కలిసిన ఎంపిడివో

రెంజల్‌, జనవరి 01 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని బుధవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో రెంజల్‌ ఎంపీడీవో గోపాలకష్ణ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్చం అందజేశారు.

Read More »

కలిసి నడుద్దాం

నిజామాబాద్‌, జనవరి 01 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అభివద్ధికి అందరం కలిసి ముందుకు వెళ్దామని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. 2020 నూతన సంవత్సరం సందర్భంగా తన ఛాంబర్‌ ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపి కార్తికేయ, డిసిపి శ్రీనివాస్‌ కుమార్‌, సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్యతో పాటు జిల్లా అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, తదితరులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ...

Read More »