Breaking News

Daily Archives: January 2, 2020

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న జుక్కల్‌ ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రంలో కొలువుదీరిన హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం జనవరి మొదటి రోజు అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. జుక్కల్‌ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పీఆర్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్‌ రావు, కొడప్‌గల్‌ ఎంపిపి ప్రతాప్‌రెడ్డి, సాయగౌడ్‌, అన్నారం వెంకట్‌రెడ్డి, సురేష్‌ ...

Read More »

అవినీతికి, నీతికి మధ్య కామారెడ్డి పురపాలక పోరు

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్స్‌లో పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్మారెడ్డి మాట్లాడుతూ రానున్న పురపాలక ఎన్నికల్లో కామారెడ్డిలో బీజేపీ జండా ఎగర వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అవినీతి కూపంలో మునిగిపోయిన కామారెడ్డి పురపాలక సంఘంలో అభివద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. గత ఐదేళ్ళ కాలంలో జరిగిన అవినీతి మొత్తాన్ని బీజేపీ ...

Read More »

సీడీసీ చైర్మన్‌గా గంగారెడ్డి

నిజాంసాగర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం లోని సీడీసీ కార్యాలయంలో సంజీవ్‌ రావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన అనంతరం మాగి జిఎస్‌ఆర్‌ ఫ్యాక్టరీ సిడిసి చైర్మన్‌గా గంగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జెడ్పి చైర్‌ పర్సన్‌ ధపెదర్‌ శోభ, ఎంపీపీ జ్యోతి, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, నాయకులు విజయ్‌ తదితరులు ఉన్నారు.

Read More »

వైకుంఠధామం పనులు ప్రారంభం

నిజాంసాగర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం వెల్గనూర్‌ గ్రామంలో వైకుంఠధామం పనులను కామారెడ్డి జిల్లా జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ, ఎంపీపీ పట్లోల జ్యోతి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో వైకుంఠధామాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రెండవ విడత పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో మురికివాడలు శుభ్రంగా ఉండాలని, ప్రతి గ్రామ పంచాయతీ అందంగా కనిపించాలన్నారు. కార్యక్రమంలో ఎఎంసి ఉపాధ్యక్షులు గైని విఠల్‌, మండల సర్పంచ్‌ల సంఘం ...

Read More »

11 నుంచి రాష్ట్రస్థాయి కబడ్డి ఛాంపియన్‌షిప్‌

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 67వ రాష్ట్ర స్థాయి పురుషుల, మహిళల సీనియర్స్‌ కబడ్డీ ఛాంపియన్‌ షిప్‌ ఈనెల 11, 12, 13 తేదీల్లో కామారెడ్డిలోని శిశు మందిర్‌ పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి ఊషిరెడ్డి, కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు కెపి వెంకట రమణారెడ్డి రెడ్డి హాజరయ్యారు. క్రీడల్లో 31 జిల్లాలనుండి పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయని, సుమారు వెయ్యి ...

Read More »

గ్రామాల అభివద్ధికే పల్లె ప్రగతి

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలను అభివద్ధి పరచడానికే పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రహదారులు- భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. భీమ్‌గల్‌ మండలం చేంగల్‌ గ్రామంలో మంత్రి రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామ సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ గ్రామం అభివద్ధి కావాలనే ఉద్దేశంతో ...

Read More »

జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభకనబర్చిన మైనార్టీ పాఠశాల విద్యార్థిని

రెంజల్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల పరిధిలోని మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థిని జవేరియా జాతీయస్థాయి క్రీడలలో సిల్వర్‌ మెడల్‌ను సాదించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి హేంగ్‌ మూడో క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా సిల్వర్‌ మెడల్‌తో పాటు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థి జాతీయ స్థాయిలో సిల్వర్‌ మెడల్‌ సాధించడంతో బాలికను ప్రిన్సిపాల్‌ ఉమేరా అంజాం, వార్డెన్‌ అయేషా కౌసర్‌, వ్యాయమ ...

Read More »

పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

రెంజల్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత విజయవంతమవుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం రెంజల్‌ మండలంలోని దూపల్లి, రెంజల్‌ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. రెంజల్‌ సర్పంచ్‌ రమేష్‌ ద్విచక్ర వాహనానికి ట్రాలీని ఏర్పాటు చేసి మొక్కలకు నీరును పోస్తున్న తీరును పరిశీలించి సర్పంచ్‌ రమేష్‌ను అభినందించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి, ఐకేపీ, ప్రభుత్వ పాఠశాలల, అంగన్‌వాడి కేంద్రాలని పరిశీలించారు. ...

Read More »

ఓటర్ల జాబితా అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో పర్యటించారు. డిసెంబర్‌ 30న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించారు. దీనిలో ప్రజలు ఏమైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని నిబంధనల మేరకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని పేర్కొన్నారు. సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఫైనల్‌ ఓటర్ల ...

Read More »