Breaking News

Daily Archives: January 3, 2020

మంథని జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి సన్మానం

ఆర్మూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంథని ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లేష్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌ రావు ఘనంగా సన్మానించారు. పెర్కిట్‌ విశాఖ హై స్కూల్‌లో జరుగుతున్న నిష్ట ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌ రావు సందర్శించి మల్లేష్‌ సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫేర్‌కు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మల్లేష్‌ చేస్తున్న ప్రయోగాలు తక్కువ ఖర్చుతో బోధనోపకరణాలను తయారు చేసే పద్ధతి ...

Read More »

కుక్కల దాడిలో వన్యప్రాణికి గాయాలు

రెంజల్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బోర్గం గ్రామ శివారు ప్రాంతంలో సంచరిస్తున్న వన్యప్రాణి (జింక) కు కుక్కలు దాడిచేయడంతో గాయపడిన జింకను గమనించిన స్థానిక గ్రామస్థులు మండల వైద్యాధికారిని సంప్రదించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఫారెస్ట్‌ అదికారులకు సమాచారం అందజేసి జింకను అప్పగించారు.

Read More »

342 జి.ఓ.కి ఆటంకమైన మెమో వెంటనే రద్దు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం పోచమ్మ గల్లిలోని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సమావేశం అధ్యక్షులు మోతే మోహన్‌ అధ్యక్షతన జరిగింది. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన జిల్లా శాఖను ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా హాజరైన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మోతే సాయన్న, రాష్ట్ర కోశాధికారి నాంది సుశీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ 342 జిఓకు ఆటంకమైన మెమోను రద్దు చేయాలని, ...

Read More »

ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గం

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా రామచందర్‌ గైక్వాడ్‌, జిల్లా ప్రధానకార్యదర్శిగా అత్తోలీ భూషణ్‌, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులుగా పుర్రె వినోద్‌ కుమార్‌, ఆరోల్లా భీమ్‌ రావు, జిల్లా కోశాధికారిగా తంగేళ్ల నితిన్‌, మహిళ ఉపాధ్యక్షులుగా ఎస్‌. వనిత, మహిళ కార్యదర్శిగా మేకల మంజుల, కార్యదర్శులుగా బోజన్న, రాజమల్లయ్య, ఆర్ముర్‌ డివిజన్‌ అధ్యక్షులుగా శేగంటి గంగాధర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Read More »

మానస హైస్కూల్‌లో సావిత్రి బాయి జయంతి

ఆర్మూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి గ్రామంలోని మానస హైస్కూల్‌లో శుక్రవారం సావిత్రి బాయి 189 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల పరిపాలనా అధికారిణి పద్మ మాట్లాడుతూ భర్త సహాయంతో విద్యను అభ్యసించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగి ఒక గొప్ప రచయిత్రిగా పేరు ప్రఖ్యాతలు గడించారన్నారు. విద్యార్ధులు కష్టపడి చదివి తల్లి దండ్రులు, ఉపాద్యాయులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశయాన్ని నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో రమేశ్‌, ఉపాద్యాయులు, విద్యార్ధులు ...

Read More »

ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు సంతప్తిగా వెళ్లాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యం కోసం వచ్చే పేషెంట్లు ఆసుపత్రి నుండి సంతప్తిగా ఇంటికి వెళ్లాలని ఆ విధంగా వైద్యాధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య కళాశాల, ఆసుపత్రి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరుందని దానికి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు వచ్చేలా అందరం కలిసి టీంగా పని చేద్దామని పేర్కొన్నారు. ...

Read More »

మూడురోజుల పాటు జాతీయ సదస్సు

డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మాస్‌ కమ్యూనికేసన్‌ విభాగం ఆద్వర్యంలో మూడురోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ ఐడియోలాజికల్‌ జర్నలిజం అనే అంశంపై సదస్సు ఉంటుందని, ఈనెల 29 నుంచి యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. శుక్రవారం సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ నసీం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. చక్కటి అంశంపై జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమని రిజిస్ట్రార్‌ అన్నారు. విభాగాధిపతి డాక్టర్‌ ప్రభంజన్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ భారతరత్న అంబేడ్కర్‌ ...

Read More »

చదువుల తల్లి సావిత్రిబాయి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుల తల్లి, బడుగు బలహీన వర్గాల మార్గదర్శి సావిత్రి బాయి పూలే 189 వ జయంతి సందర్భంగా బిసి సంక్షేమ సంఘం నాయకులు అంబేద్కర్‌ కాలనీలో గల సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేవలం బడుగు బలహీన వర్గాలే కాకుండా అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు, భర్త లేని స్త్రీలకు ఎంతో మంది అభాగ్యులకు ముఖ్యంగా స్త్రీలకు విద్యను నేర్పిన చదువుల తల్లి సావిత్రి బాయి పూలే అని వారన్నారు. ఎన్నో కష్టాలను ...

Read More »

ఎన్నికల జాబితా మార్క్‌డు కాపీలలో డబుల్‌ నేమ్‌, డెత్‌ ముద్రలు

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన జాబితా ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికలకు వార్డుల ప్రకారము ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. తన పర్యటనలో భాగంగా శుక్రవారం ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్‌ 30న మున్సిపాలిటీల పరిధిలో వార్డులకు అనుగుణంగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 4న చివరి జాబితా ...

Read More »

డంపింగ్‌ యార్డు పనులు పరిశీలించిన జడ్పి ఛైర్మన్‌

నందిపేట్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం ఆంధ్రానగర్‌ గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో జెడ్పి చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మశాన వాటిక ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం డంపింగ్‌ యార్డ్‌ పనులను పరిశీలించారు. పశుసంవర్దక శాఖ సంయుక్త సంచాలకులు బాలిక్‌ అహ్మద్‌, మజార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రపంచం జీరో వేస్ట్‌ గురించి ఆలోచిస్తోంది

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏ వస్తువును కూడా వధా చేయకుండా దానిని తిరిగి ఉపయోగించడానికి ప్రపంచం జీరో వేస్ట్‌ గురించి ఆలోచిస్తోందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ తన పర్యటనలో భాగంగా బాల్కొండ మండలం చిట్టాపూర్‌ గ్రామంలోనూ, ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ గ్రామంలోనూ, ఆర్మూర్‌ మండల కేంద్రంలో మున్సిపల్‌ కార్యాలయంలో, ఆర్డీవో కార్యాలయంలో పర్యటించారు. ఈ సందర్భంగా చిట్టాపూర్‌, రాంపూర్‌లలో పల్లె ప్రగతి పనులను పరిశీలించి ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ప్రైవేటు స్థలాల్లో చెత్త గాని ...

Read More »

పల్లె ప్రగతిలో మొక్కలు నాటారు.

ఆర్మూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండలంలో శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో ఎంపీపీ దీకొండ హరిత పర్యటించారు. జక్రాన్‌ పల్లి, గన్యతాండ, పుప్పాలపల్లి, మాదాపూర్‌లలో పర్యటించి మొక్కలు నాటారు. డిఆర్‌డివో రాథోడ్‌, ప్రత్యేకాదికారి గోవింద్‌, ఎంపీడీవో భారతి, ఎమ్మార్వో రాజు, ఆయా గ్రామల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

ప్లాస్టిక్‌ నిషేదం అమలుకు అందరు సహకరించాలి

నందిపేట్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ని వాడవద్దని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని జెడ్పి చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు సూచించారు. శుక్రవారం నందిపేటలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో విఠల్‌ రావు పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ను వాడుతున్న వైన్‌ షాప్‌లకు రెండువేల ఐదు వందల చొప్పున గ్రామపంచాయతీ జరిమానా వేయగా చైర్మెన్‌ రసీదు అందజేశారు. ప్లాస్టిక్‌ నిషేధం అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రత్యేక అధికారి బాలిక్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Read More »