Breaking News

మూడురోజుల పాటు జాతీయ సదస్సు

డిచ్‌పల్లి, జనవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మాస్‌ కమ్యూనికేసన్‌ విభాగం ఆద్వర్యంలో మూడురోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ ఐడియోలాజికల్‌ జర్నలిజం అనే అంశంపై సదస్సు ఉంటుందని, ఈనెల 29 నుంచి యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. శుక్రవారం సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ నసీం తన చాంబర్‌లో ఆవిష్కరించారు.

చక్కటి అంశంపై జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమని రిజిస్ట్రార్‌ అన్నారు. విభాగాధిపతి డాక్టర్‌ ప్రభంజన్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ భారతరత్న అంబేడ్కర్‌ అణగారిన వర్గాల కోసం జనవరి 31, 1920లో మూక్‌నాయక్‌ అనే పత్రిక ప్రారంభించి సైద్ధాంతిక జర్నలిజానికి బాటలు వేశారని తెలిపారు. మూక్‌నాయక్‌ ప్రారంభించి వందసంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు వివరించారు.

దేశం నలుమూలల నుంచి 300 మంది డెలిగేట్స్‌ పత్ర సమర్పణ చేస్తారని తెలిపారు. మొదటిరోజు సిద్ధాంత పత్రాలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సదస్సు డైరెక్టర్‌గా డాక్టర్‌ ప్రభంజన్‌, కన్వీనర్‌గా డాక్టర్‌ కె.రాజారాం వ్యవహరిస్తారన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శాంతాబాయి, డాక్టర్‌ జెట్లింగ్‌ యెల్లోసా, ప్రభుత్వ పాలన శాస్త్రం హెడ్‌ డాక్టర్‌ పున్నయ్య, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *