Breaking News

Daily Archives: January 5, 2020

వైకుంఠ ఏకాదశి విశిష్టత

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ...

Read More »

అవార్డులు బాధ్యతను పెంచుతాయి

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోషల్‌ మీడియా మరియు పత్రికా రంగము ఇంతగా ప్రాచుర్యం లేని సమయంలోనే మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదుర్కొన్న ధీరవనిత సావిత్రిబాయి పూలే అని వక్తలన్నారు. ఆదివారం డిచ్‌పల్లి కెఎన్‌ఆర్‌ గార్డెన్‌లో బిసిటియు ఆధ్వర్యంలో బిసిటియు జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్‌ కుమార్‌ సభాధ్యక్షతన మహిళా ఉపాధ్యాయులకు, ఉద్యోగినులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమంలో జడ్పి ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ఆకుల లలిత, డిఇవో జనార్ధన్‌ రావు ...

Read More »

8న సార్వత్రిక సమ్మె

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 8 న జరిగే సార్వత్రిక సమ్మెను, గ్రామీణ భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు ఆదివారం మాచారెడ్డి మండలంలో సమ్మెకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూమన్న, జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు మాట్లాడారు. వ్యవసాయ పంటలన్నిటికీ ఉత్పత్తి ఖర్చులపై 50 శాతం అదనంగా గిట్టుబాటు ధర లభించే విదంగా పార్లమెంట్‌లో చట్టం చేయాలని, అలాగే రైతులకు ...

Read More »

పూర్వవిద్యార్థుల ఐదు లక్షల విరాళం

రెంజల్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కొరకు విరాళాల సేకరణలో భాగంగా పూర్వవిద్యార్థులు జోరుగా ముందుకు వచ్చి తమవంతు విరాళాలు అందజేశారు. రెంజల్‌ పాఠశాలలో 5 లక్షల 30 వేలు అందజేయగా, 13 గ్రామపంచాయతీలో ముగ్గురు తమ ఊరి మహారాజులు లక్ష రూపాయల పైన అందజేశారు. సాటాపూర్‌, తాడ్‌ బిలోలి, దూపల్లి గ్రామాలలో పూర్వ విద్యార్థులు తమవంతు సహకారం అందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విజయ్‌ కుమార్‌, ఎంపీడీవో గోపాలకష్ణ, ఎంపీఓ గౌస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు ...

Read More »

9న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజాంసాగర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 9న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపడుతున్నట్టు ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు బిచ్కుందలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి కొక్కెర భూమన్న, రాష్ట్ర కార్యదర్శి బాబురావు, జిల్లా ప్రచార కార్యదర్శి ఆర్‌ భూమయ్య, సర్పంచ్‌లు లాలు, లక్ష్మణ్‌ యాదవ్‌, రాజు, దేవదాస్‌, అంజయ్య, సాయిలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

ఉచిత వైద్య శిబిరం

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జీవదాన్‌ పాఠశాల ముందు ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రోనమో సంఘం, ఆకుల భరత్‌ ఆధ్వర్యంలో షుగర్‌, రక్తపోటు, థైరాయిడ్‌ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ లక్ష్మి లావణ్య అలపాటి రోగులకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమాన్ని కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరంలో సుమారు 700 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేశారు. అలాగే అకుల భరత్‌ 34 ...

Read More »

అఖండ శివనామ సప్త కరపత్రాల ఆవిష్కరణ

నిజాంసాగర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజక వర్గంలోని బిచ్కుంద మండలం పెద్ద దేవాడలో అఖండ శివనామ సప్త కరపత్రాలను విడుదల చేశారు. మద్నూర్‌ మండలం పెద్ద ఎక్లార గ్రామంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అఖండ శివనామ సప్త వివరాలు తెలియజేశారు. మండల వీరశైవ లింగాయత్‌, ప్రజా ప్రతినిధులు పండిత్‌ రావ్‌ పటేల్‌, బన్సీ పటేల్‌, బిచ్కుంద ఎంపీపీ అశోక్‌ పటేల్‌, సర్పంచ్‌ శివానంద్‌ అప్ప, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌ అప్ప అధ్యక్షతన ...

Read More »

మైనార్టీ పాఠశాలను సందర్శించిన దళిత సైన్యం నాయకులు

నిజాంసాగర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండలంలోని మైనార్టీ పాఠశాలలో నెల రోజుల క్రితం గజ్జి, తామర వంటి వ్యాధులు వ్యాపించాయి విషయం తెలుసుకున్న దళిత సైన్యం, మైనార్టీ నాయకులు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడి ప్రిన్సిపాల్‌ జయరాజ్‌, సిబ్బంది సకాలంలో స్పందించి ఆసుపత్రిలో చికిత్స చేయించడంతో వ్యాధి నయమైందని విద్యార్థులు పేర్కొన్నారు. కాగా ఆదివారం నాయకులు సందర్శించి ఇంకేమైనా సమస్యలున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇందులో ...

Read More »

పాఠశాలకు పూర్వవిద్యార్థుల విరాళం

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాంపూర్‌ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 20 మంది పూర్వ విద్యార్థులు ప్రైమరీ స్కూల్‌కు 42 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ దయానంద్‌, పంచాయతీ కార్యదర్శి సాయికష్ణ, ప్రధానోపాధ్యాయులు రాజకుమార్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సుకుమార్‌, ఆశ కార్యకర్త, అంగన్‌ వాడి టీచర్‌, విఓఏ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »