Breaking News

Daily Archives: January 6, 2020

సార్వత్రిక సమ్మెకు అనుమతించాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేకు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్‌, ఎస్పికి వినతి పత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సార్వత్రిక సమ్మెను జయప్రదం కోరుతూ కార్మిక, ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్టంలో మున్సిపల్‌ ఎలక్షన్‌ కోడ్‌ రావడం మూలంగా కార్మికులు చేసే ర్యాలీ, సభకు, ఎలాంటి ఆటంకాలు కల్పించ వద్దని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు, ఏఏఎస్పీ అనూన్యకు కార్మిక, విద్యార్థి సంఘాలు నాయకులు ...

Read More »

కామరెడ్డి మునిసిపల్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి మాజీ శాసనమండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి మున్సిపోల్‌ ఎలక్షన్‌లో పోటీ చేయడానికి 49 వార్డ్‌లలో కాంగ్రెస్‌ నాయకులు పెద్దయెత్తున దరఖాస్తులు సమర్పించారన్నారు. ఆది, సోమవారాల్లో రెండ్రోజుల్లోనే సుమారు 500 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిపై కోర్‌ కమిటీ ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ...

Read More »

డంపింగ్‌ యార్డు నిర్మాణానికి భూమిపూజ

నసురుల్లాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండలం మైలారం గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణ పనులకు సర్పంచ్‌ యశోద మహేందర్‌ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, కామారెడ్డి జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు మజీద్‌, జెడ్‌పిటిసి జన్ను బాయ్‌, ప్రతాప్‌, ఎంపీటీసీ ప్రభాకర్‌ రెడ్డి, ఎంపిఓ రాము, స్పెషల్‌ ఆఫీసర్‌ సుజాత, దూళి గంగారాం, చంద్ర గౌడ్‌, తిరుపతి, జనపల్లి గంగారాం, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Read More »

తెరాస కార్యకర్తల సమావేశం

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్శిరాములు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కామారెడ్డి పట్టణ తెరాస పార్టీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ బి.బి.పాటిల్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్‌, లక్షారెడ్డి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మూజిబోద్దీన్‌, కామారెడ్డి పట్టణ తెరాస ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

మహిళల రక్షణ కొరకు ప్రతిజ్ఞ

బీర్కూర్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం మహాత్మా జ్యోతిబా పులే బాలుర పాఠశాలలో మహిళల రక్షణ కొరకు సురక్షిత కామారెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే మహిళల రక్షణ కొరకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వసంత్‌ రెడ్డి, సహాయ ప్రిన్సిపాల్‌ రఘునాథ్‌, ఉపాధ్యాయులు శివకుమార్‌, సాయిలు, శ్రీహరి, సరిత, శ్రావణి, మహేష్‌, పవన్‌ పాల్గొన్నారు.

Read More »

వైష్ణవ ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం

నిజామాబాద్‌ రూరల్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరిచారు. పలువురు ప్రముఖులు దైవ దర్శనం చేసుకున్నారు. భీంగల్‌ మండల కేంద్రంలోని పురాతన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఉత్తర ద్వారా దైవ దర్శనం చేసుకొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. నిజామాబాదు ఉత్తర తిరుపతి ఆలయంలో జెడ్పి చైర్మెన్‌ విఠల్‌ రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అలాగే మోపాల్‌ మండలంలోని ...

Read More »

పలు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాలకు భూమి పూజ

రెంజల్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కిసాన్‌ తాండ, దండిగుట్ట, వీరన్నగుట్ట తండా, అంబేద్కర్‌ నగర్‌, మౌలాలి తాండా, పేపర్‌ మిల్లు గ్రామాలలో సోమవారం వైకుంఠధామం పనులను ఎంపీపీ లోలపు రజిని కిషోర్‌, సర్పంచులు, మలావత్‌ జమున, ముళ్లపూడి శ్రీదేవి, జాదవ్‌ గణేష్‌ నాయక్‌, మతురాబాయి, జాదవ్‌ సునీత బాబునాయక్‌, అలియా బేగం ప్రారంభించారు. ఒక్కొక్క వైకుంఠధామనికి 12 లక్షల 60 వేల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ఎంపీడీవో గోపాలకష్ణ తెలిపారు. ఇట్టి పనులను త్వరితంగా ...

Read More »

హనుమాన్‌ ఫారంలో పల్లె ప్రగతి

నవీపేట్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం హనుమాన్‌ ఫారం గ్రామంలో సోమవారం జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు పాల్గొన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వైకుంఠ ధామం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో నవీపేట మండల పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, జడ్పీటీసీ సవిత, ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి, స్థానిక సర్పంచ్‌, నాయకులు పాల్గొన్నారు.

Read More »

ఐకమత్యంతోనే అభివృద్ధి

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ముద్రించిన కాలమానిని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ సోమవారం నిజామాబాదు వర్ని రోడ్డులోని చాత్తాద శ్రీ వైష్ణవ సంఘ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి కులాలన్నీ ఏకమై ఐక్యమత్యంతో ఉన్నప్పుడు ఇంకా ప్రగతిని సాధించవచ్చని అన్నారు. కులాలు ఏకమైతేనే అభివద్ధి సాధ్యమని పేర్కొన్నారు. బిసి కులాలన్ని ఏకమై ఐక్యమత్యం చాటినప్పుడు అన్ని కులాల అభివద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో బిసి ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్‌ భూమి పూజ

రెంజల్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోనీ ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో సోమవారం సర్పంచ్‌ వెలమల సునీత నరసయ్య, ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌ మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ నిధుల నుంచి లక్షా 90 వేల రూపాయలు మంజూరు కావడంతో అట్టి నిధులతో పనులను ప్రారంభించారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ మస్కుర్‌ లక్ష్మి, ఎంపీడీవో గోపాలకష్ణ, ఎంపిఓ గౌస్‌ ఉద్దీన్‌, ఈసి శరత్‌ ...

Read More »

గ్రామ ప్రణాళిక ఏమిటో ప్రజలకు తెలియాలి

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రణాళిక ఎంతో గ్రామ ప్రజలందరికీ తెలియజేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అధికారులకు తెలిపారు. సోమవారం పల్లె ప్రగతి 2 కార్యక్రమంలో భాగంగా ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్‌తో కలిసి ఆమె జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌ పల్లి, ఆర్మూర్‌ మండలం గోవింద్‌ పేట్‌, మెండోరా మండలం బుస్సాపూర్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామ సభల్లో పాల్గొని జరుగుతున్న పనులపై గ్రామ సమస్యలపై ప్రజలతో ముఖాముఖి ...

Read More »

వీరన్నగుట్టలో శ్రమదానం

రెంజల్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో ఎంపీపీ రజినీ, తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, సర్పంచ్‌ బైండ్ల రాజు ఆధ్వర్యంలో గ్రామస్థులు శ్రమదానం నిర్వహించారు. గ్రామంలోని రహదారుకి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. గ్రామంలో ప్రధాన వీధులగుండా ఉన్న చెత్తను తొలగించి ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్‌ ఎంపీపీ యోగేష్‌, టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమరెడ్డి, రఫిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైకుంఠధామాల నిర్మాణానికి భూమిపూజ

మాక్లూర్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో సోమవారం జడ్పి చైర్మన్‌ దాదన్న విట్టల్‌ రావు, ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు. మాక్లూర్‌ మండలంలోని మెట్‌పల్లి, గుంజిలి, చికిలి, వల్లభాపూర్‌ గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణ పనులకు వారు భూమి పూజ చేశారు. మాక్లూర్‌ ఎంపీడీఓ, ఎంపీపీ, స్థానిక సర్పంచులు తెరాస నాయకులు పాల్గొన్నారు.

Read More »