Breaking News

Daily Archives: January 7, 2020

ఫీజు చెల్లింపునకు ఈనెల 17 చివరితేదీ

డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని అనుబంధ న్యాయశాస్త్ర కళాశాలల్లో ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల ఫీజు గడువు ఈనెల 17వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. వంద రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 21వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. మరిన్ని వివరాలకోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Read More »

సార్వత్రిక సమ్మె జయప్రదం చేద్దాం

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 8 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దామని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించిన గోడప్రతులను ఎలారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు కార్మికులతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దశరథ్‌ మాట్లాడుతూ కనీస వేతనం కార్మికులకు నెలకు 21 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రవేటికరణ అపాలని, అలాగే బ్యాంకుల విలీనం నిలిపివేయాలని పేర్కొన్నారు. ప్రవేట్‌ బ్యాంకులను ...

Read More »

శ్రీ సరస్వతీ విద్యామందిర్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ సరస్వతీ విద్యామందిర్‌ పాఠశాల విద్యార్థులతో కూడిన క్యాలెండర్‌ను పాఠశాల అధ్యక్షులు డాక్టర్‌ శ్యాం సుందర్‌ రావు, కార్యదర్శి అర్కల మల్లేష్‌ యాదవ్‌, సమితి అధ్యక్షులు బొడ్డు శంకర్‌, విద్వత్‌ సమితి సభ్యులు ఎస్‌.ఎన్‌ చారి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు నాగభూషణం, నగేష్‌ పాల్గొన్నారు.

Read More »

జాతీయ గ్రీన్‌ కోర్‌ ఆద్వర్యంలో మొక్కలు నాటారు

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వేల్పుర్‌ మండలంలో మంగళవారం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జాతీయ గ్రీన్‌ కోర్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప తహశీల్దార్‌ రాజశేఖర్‌, పాఠశాల ఉపాధ్యాయులు, అటవీ శాఖ అధికారులు, పూర్వ విద్యార్థులు గిన్నిస్‌ బుక్‌ అవార్డు గ్రహీత యం.యస్‌ ఆచార్య, గంగాధర్‌ గౌడ్‌, రిటైర్డ్‌ టీచర్‌ మార్కండేయ సార్‌, తహశీల్దారు సతీష్‌ రెడ్డి, ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్‌, యం.పి.పి బీమా జమున, రాజేందర్‌, యం.పి.టీ.సి మొండి మహేష్‌, ...

Read More »

ఆంధ్రపాలన కంటే తెరాస పాలన అధ్వానం

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి పాలన నాటి ఆంధ్ర పాలన కంటే అధ్వాన్నంగా తయారైందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా ఇన్‌చార్జి కంబాల లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు, నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉండటంతో చాలామంది విద్యార్థులు, కళాశాలలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ...

Read More »

అమెరికా యుద్దోన్మాద చర్యలను ఖండించాలి

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇరాన్‌పై అమెరికా యుద్దోన్మాద చర్యను ఖండిస్తూ న్యూడెమోక్రసీ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు దేవారాం, సీపీఎం కార్యదర్శి వెంకటేష్‌ మాట్లాడారు. ఇరాన్‌ సైనిక అధికారి సులేమాని పై డ్రోన్‌ ల దాడితో హతమార్చి మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతోందని, తద్వారా ప్రపంచ దేశాలను ముఖ్యంగా పేద, అభివద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి ...

Read More »

సార్వత్రిక సమ్మె జయప్రదంచేయాలని బైక్‌ ర్యాలీ

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, ఏఐటియుసి అధ్యక్షుడు ఆరేపల్లి సాయిలు, ఏఐకెఎంఎస్‌ దేవారాం, బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యశివాజీ తదితర కార్మిక, విధ్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read More »

మునిసిపల్‌ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటాం

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి జిల్లా మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి, పీసీసీ సెక్రటరీ మక్సుద్‌ అహేమద్‌ దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి మున్సిపోల్‌ ఎలక్షన్‌లో పోటీ చేయడానికి 49 వార్డులనుండి కాంగ్రెస్‌ నాయకులు పెద్దయెత్తున దరఖాస్తులు సమర్పించారన్నారు. మూడు రోజుల్లో ఇప్పటి వరకూ దాదాపు ఆరువందలకు పైగా దరఖాస్తులు అందయని తెలిపారు. స్పందన చూస్తుంటే ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న నమ్మకం, కాంగ్రెస్‌ ...

Read More »

డంపింగ్‌ యార్డ్‌ పనులను ప్రారంభించిన సర్పంచ్‌

రెంజల్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా డంపింగ్‌ యార్డ్‌ పనులను సర్పంచ్‌ శనిగరం సాయరెడ్డి, ఎంపీడీఓ గోపాలకష్ణ మంగళవారం ప్రారంభించారు. గ్రామంలోని చెత్తా చెదారాన్ని తొలగించేందుకు సుమారు 25 ట్రాక్టర్ల చెత్తను డంపింగ్‌ యార్డ్‌కు తరలించారు. డంపింగ్‌ యార్డు ఆకారాన్ని పెంచడానికి గాను జెసిబి తో పనులను ప్రారంభించారు. స్వచ్ఛ గ్రామమే లక్ష్యంగా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్‌ సాయరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో గౌస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ ...

Read More »

సిఏఏ, ఎన్‌ఆర్‌సి బిల్లులు దేశ సమగ్రత కోసం

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఏఏ, ఎన్‌ఆర్‌సి బిల్లులు ఎవరిని ఉద్దేశించినవి కావని, అవి దేశ సమగ్రత కోసం తీసుకున్న నిర్ణయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సిఏఏ, ఎన్‌ఆర్‌సికి మద్దతుగా జిల్లా కేంద్రంలో బిజెపి ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికి పార్టీ శ్రేణులు, హిందువులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గాంధీ గంజ్‌ నుంచి ప్రారంభించిన ర్యాలీ సిరిసిల్లా రోడ్డు, పాత ...

Read More »

పల్లెప్రగతిలో చెత్త బుట్టల పంపిణీ

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం కులాస్‌ పూర్‌ గ్రామంలో మంగళవారం జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో జడ్పి చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను, మధ్యాహ్న భోజన పథకం తీరును పరిశీలించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామస్తులకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లత, జెడ్పిటిసి కమల, బాజిరెడ్డి జగన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

జెఎన్‌యు వైస్‌ఛాన్స్‌లర్‌ను తొలగించాలి

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జెఎన్‌యు వైస్‌ ఛాన్స్‌లర్‌ను తొలగించాలని సిపిఎం నిజామాబాద్‌ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు, జిల్లా నాయకులు వెంకట్‌ రాములు మాట్లాడారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ను వెంటనే తొలగించాలని, దాడి చేసిన అరాచక వాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా భావ సంఘర్షణ జరిగే యూనివర్సిటీల్లో వరుసగా బిజెపి మద్దతు ఇస్తున్న ఏబీవీపీ విద్యార్థి ...

Read More »

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

ధర్పల్లి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తమ సొంత ఖర్చుతో సభ్యులందరం కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు తమకు తోచినంత సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు.

Read More »

కలెక్టర్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన జేసీ

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మొక్కను నాటి సంయుక్త కలెక్టర్‌కు గ్రీన్‌ చాలెంజ్‌ విసరడంతో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు దానిని స్వీకరించి తన క్యాంపు కార్యాలయంలో మొక్కను నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌గా స్పందించి అధికారులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి తాను మొక్క నాటి ...

Read More »

సంక్షేమ అధికారులు తల్లిదండ్రుల పాత్ర పోషించాలి

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతి గహాల్లో ఉండే విద్యార్థులు అత్యంత పేద కుటుంబాల నుంచి వచ్చేవారని, వారితో అధికారులు తల్లిదండ్రుల పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశమందిరంలో సంక్షేమ హాస్టళ్ల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతి గహాల్లో పనిచేసే అధికారులకు క్రమశిక్షణ తప్పనిసరి అవసరమని, వారు పాటిస్తూ విద్యార్థులను కూడా క్రమశిక్షణలో ఉండేలా చూడాలన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులంతా అత్యంత పేద కుటుంబాల ...

Read More »

ఒకే పోలింగ్‌ స్టేషన్‌లో డబుల్‌ ఉంటే బిఎల్‌వోలపై చర్యలు

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల జాబితాలో ఒకే పార్ట్‌ లేదా పోలింగ్‌ స్టేషన్‌లో ఒకే వ్యక్తి పేర్లు రెండు సార్లు వస్తే సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం చీఫ్‌ ఎలెక్టోరల్‌ ఆఫీసర్‌ రజత్‌కుమార్‌ జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఎస్‌ఆర్‌, డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌, అభ్యంతరాల స్వీకరణ, కొత్తగా నమోదుకు దరఖాస్తు చేసుకోవడం, ఈఎల్‌సి, జాతీయ ఓటర్ల దినోత్సవం తదితర విషయాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు ...

Read More »

ఆసుపత్రిలో సేవల మెరుగుకు చర్యలు

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో అత్యవసర సదుపాయాలు సమకూర్చి రోగులకు మరింత నాణ్యమైన సేవలు అందించడానికి చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి అన్ని విభాగాల అధిపతులతో తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ నెల 3న ప్రభుత్వ ఆసుపత్రిలో అందరు డాక్టర్లు, సిబ్బందితో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆసుపత్రికి కావలసిన సదుపాయాలు మిషనరీ సిబ్బంది వివరాలను వారు తెలియజేయగా, తదుపరి ఏర్పాటు చేసే ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ

రెంజల్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ భూమి పూజ చేశారు. ఇటీవల పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరుగుదొడ్ల ఇబ్బందులు తెలుసుకొని తన ప్రత్యేక నిధుల నుంచి 50 వేల రూపాయలను మంజూరు చేశారు. ఇట్టి నిధులతో యుద్ధ ప్రాతిపదిక పైన నిర్మాణం పనులను పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్‌ అసదుల్లా ...

Read More »

రికార్డు అసిస్టెంట్‌ సస్పెండ్‌

నిజామాబాద జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎటువంటి అనుమతి లేకుండా దీర్ఘకాలంగా గైర్హాజరులో ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖ రికార్డు అసిస్టెంట్‌ జాకిర్‌ ఖాన్‌ను సస్పెండ్‌ చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సంక్షేమ అధికారులతో సమావేశం సందర్భంగా గత 80 రోజులుగా ఎటువంటి అనుమతి లేకుండా నాగారంలోని మైనార్టీ సంక్షేమ వసతి గహంలో పనిచేస్తున్న రికార్డ్‌ అసిస్టెంట్‌ జాకీర్‌ ఖాన్‌ గైర్హాజరులో ఉన్నట్లు సమీక్ష సందర్భంగా ఆయన దష్టికి వచ్చింది. వెంటనే ఆయనను సస్పెండ్‌ చేయడానికి ...

Read More »