Breaking News

ఫీజు చెల్లింపునకు ఈనెల 17 చివరితేదీ

డిచ్‌పల్లి, జనవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని అనుబంధ న్యాయశాస్త్ర కళాశాలల్లో ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల ఫీజు గడువు ఈనెల 17వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఘంటా చక్రపాణి తెలిపారు.

వంద రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 21వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. మరిన్ని వివరాలకోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Check Also

ఒకరోజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మరియు ...

Comment on the article