Breaking News

Daily Archives: January 9, 2020

17న మేధావుల సదస్సు

నిజామాబాద్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఏఏ పైన ప్రజ్ఞా భారతి పేరుతో మేధావుల సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రజ్ఞాభారతి ప్రతినిధులు తెలిపారు. ఈనెల 17న సాయంత్రం 6.30 గంటలకు నిజామాబాద్‌ నగరంలోని బస్వాగార్డెన్స్‌లో సదస్సు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రధానవక్తగా భారతీయ జనతాపార్టీ ప్రవక్త రఘునందన్‌రావు హాజరుకానున్నారని పేర్కొన్నారు. సదస్సులో వైద్యులు, న్యాయవాదులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కుల సంఘాల పెద్దలు, ఆఫీసర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

Read More »

కాంగ్రెస్‌ పార్టీ ఏ – ఫాం అందజేత

కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌పిసిసి ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి సెక్రటరరీ సి.జే శ్రీనివాస్‌ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అందించే ఏ – ఫామ్‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అందజేశారు. ఏ – ఫాం అందజేసిన వారిలో గూడెం శ్రీనివాస్‌ రెడ్డి, దాత్రిక సత్యం, శహబాస్‌ ఉన్నారు.

Read More »

రిజిస్టర్‌ చేసుకున్న ఆసుపత్రిలోనే పురుడు పోసుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిహెచ్‌సి, సిహెచ్‌సి ఆస్పత్రుల్లో పేరు నమోదు చేసుకున్న ప్రతి మహిళ అక్కడే పురుడు పోసుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని 8 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల వైద్య అధికారులతో ప్రభుత్వంలోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యాధికారులు అందించిన నివేదికల ప్రకారం అవుట్‌ పేషెంట్‌ ప్రక్రియ బాగానే నడుస్తున్నప్పటికి ఇన్‌ పేషెంట్‌, ప్రసూతి కార్యక్రమాలు చాలా తక్కువగా ...

Read More »

వైకుంఠ ధామాల నిర్మాణాలకు భూమిపూజ

మాక్లూర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని వెంకటాపూర్‌, గొట్టుముక్కుల, ముల్లంగి, మాదాపూర్‌, చిన్నాపూర్‌ గ్రామాలలో గురువారం జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలలో నిజామాబాదు జెడ్పి చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నిర్మించనున్న వైకుంఠ ధామాల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజలు చేశారు. బొంకన్‌పల్లిలో చెత్త బుట్టలను పంపిణి చేశారు. ఎంపీడీఓ, సర్పంచులు, తెరాస నాయకులు గోపాల్‌ నగేష్‌, రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Read More »

డయల్‌ 100, 112 పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ముద్రించిన డయల్‌ 100, 112 అత్యవసర సహాయ నంబర్ల పోస్టర్లను గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు క్యాంప్‌ కార్యాలయంలో కామారెడ్డి యస్‌.పి శ్వేతారెడ్డి ఆవిష్కరించారు. అత్యవసర సహయ నంబర్ల పోస్టర్లు ముద్రించిన వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ నిర్వాహకులను ఎస్పి ఈ సందర్భంగా అభినందించారు. పోస్టర్లను కళాశాలలు తదితర జన సమర్ద ప్రాంతాలలో అతికించడం ద్వారా అత్యవసర నంబర్ల విషయాన్ని విస తంగా ప్రచారం ...

Read More »

19న పల్స్‌ పోలియో

నిజామాబాద్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19న జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల లోపు ప్రతి ఒక్క చిన్నారికి కూడా ఎవ్వరూ మిస్‌ కాకుండా పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని అధికారులను ఆదేశించారు. అన్ని ...

Read More »

లక్ష్య సాధన కోసం కషి చేయాలి

కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి గణిత మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్‌ మల్లికార్జున్‌ మాట్లాడారు. 60 రోజుల గణిత సాధన ప్రణాళికను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదరికం, పరిస్థితులు చదువుకోవడానికి ఏమాత్రం అడ్డుకావన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీపతి మాట్లాడుతూ విద్యార్థులు చక్కని ప్రణాళిక, సమయపాలన సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తేవాలన్నారు. విద్యార్థి దశ నుండే సేవా గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ...

Read More »

లంచాల మునిసిపాలిటీగా మారింది

నిజామాబాద్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం అభివద్ధి కావాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మంచి నాయకులను ఎన్నుకోవాలని టీఆర్‌ఎస్‌ పోలిట్‌ బ్యూరో సభ్యుడు ఎ.ఎస్‌.పోశెట్టి పిలుపునిచ్చారు. గురువారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీపై ఫైర్‌ అయ్యారు. టిఆర్‌ఎస్‌ పాలనలో నగరం అభివద్దిలో చాలా వెనుకబడి వుందని, అభివద్ది కోసం వచ్చిన నిధులు ఎక్కడికి వెళుతున్నాయో తెలియటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, అండర్‌ ...

Read More »

రిటర్నింగ్‌ అధికారుల పాత్ర చాలా కీలకం

నిజామాబాద్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలలో రిటర్నింగ్‌ అధికారుల పాత్ర ఎంతో కీలకమైందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం బోధన్‌లోని ఉర్దూ ఘర్‌లో రిటర్నింగ్‌ అధికారులకు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ఏర్పాటుచేసిన మున్సిపల్‌ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల విధుల కంటే కూడా స్థానిక ఎన్నికల విధులు కొంత కష్టంతో కూడుకున్న పనని తెలిపారు. ఎన్నికలపై క్లోజ్‌గా పర్యవేక్షణ ఉంటుందని స్థానిక ఎన్నికలు ...

Read More »

కూనేపల్లి గ్రామంలో శ్రమదానం

రెంజల్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కోనేపల్లి గ్రామంలో సర్పంచ్‌ శ్రీదేవి ఆధ్వర్యంలో గ్రామస్థులు శ్రమదానానికి శ్రీకారం చుట్టారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని చెత్తా చెదారాన్ని, మురికి కాల్వలను శుభ్రం చేయడంతో పాటు, వాటిని డంపింగ్‌ యార్డుకు తరలించారు. గ్రామంలోని, డంపింగ్‌ యార్డ్‌, మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామస్థులందరూ పాల్గొని చెత్తాచెదారాన్ని డంపింగ్‌ యార్డుకు తరలించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గౌతమి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

13న అభ్యర్థులను బి ఫాంలు అందజేస్తాం

కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగామ మాజీ మంత్రి, శాసనమండలి మాజీ ప్రతిపక్ష నేత మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌, కాంగ్రెస్‌ పార్టీ ఐటీ సెల్‌ అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి మున్సిపోల్‌ ఎలక్షన్‌ పోటీ చేయడానికి 49 వార్డులలో కాంగ్రెస్‌ నాయకులు పెద్దయెత్తున దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రతి ...

Read More »

ఎడపల్లి గ్రామ కార్యదర్శి సస్పెండ్‌

నిజామాబాద్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో ఎడపల్లి మండల కేంద్రంలో అపరిశుభ్రతపై జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శి నగేష్‌ ను సస్పెండ్‌ చేయవలసినదిగా ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయన మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించి పల్లె ప్రగతిలో నిర్వహించిన పనులపై మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపీడీవో శంకర్‌, సర్పంచ్‌ మాధవిలతో కలిసి గ్రామంలోని వీధులలో పర్యటించి ఎక్కడ కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించలేదని అసంతప్తి వ్యక్తం చేశారు. ...

Read More »