Breaking News

Daily Archives: January 10, 2020

25వ డివిజన్‌ నుంచి వనమాల కృష్ణ నామినేషన్‌

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 25 వ డివిజన్‌ కార్పొరేటర్‌గా సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ నుంచి వనమాల కష్ణ నామినేషన్‌ దాఖలు చేశారు. వనమాల కష్ణ గతంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి కార్పొరేటర్‌గా పని చేశారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ కార్మికుల పక్షాన పోరాడుతున్న వనమాల కష్ణ డివిజన్‌ కార్పొరేటర్‌ పోటీచేయడానికి చేయడానికి సిపిఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ నిర్ణయించింది. నామినేషన్‌ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు వెంకన్న, సుధాకర్‌, అల్గోట్‌ రవీందర్‌, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, ...

Read More »

16వ డివిజన్‌ నుండి ట్రాన్స్‌జెండర్‌ నామినేషన్‌

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 16 వ డివిజన్‌ అభ్యర్థిగా ట్రాన్స్‌ జెండర్‌ (హిజ్రా) జరీనా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరీనా మాట్లాడుతూ తనను ప్రజలు ఆదరించాలని, ప్రజా సమస్యలపై పని చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హిజ్రా ట్రాన్స్‌ జెండర్స్‌ జిల్లా కార్యదర్శి గంగ, ఉపాధ్యక్షులు అలక, అక్షర, మాధురి, శ్యామల, లతా, తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెరాస అభ్యర్థిగా రంగు అపర్ణ సీతారామ్‌ నామినేషన్‌

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం 27వ డివిజన్‌ నుంచి తెరాస పార్టీ తరఫున కార్పొరేటర్‌ అభ్యర్థిగా రంగు అపర్ణ సీతారామ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక పూలంగ్‌ వద్దగల టిటిడి కళ్యాణ మండపం పక్కన ఏర్పాటు చేసిన జోన్‌ కార్యాలయంలో నామినేషన్‌ సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదేళ్లలో తమ డివిజన్‌లో ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించడంలో తమవంతు ప్రయత్నం చేయడం ...

Read More »

34వ వార్డు బిజెపి అభ్యర్థిగా రాధా శ్రావణ్‌ నామినేషన్‌

కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి 34 వ వార్డు బిజెపి అభ్యర్థిగా శుక్రవారం మున్నం రాధా శ్రావణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కామారెడ్డిలో శ్రావణ్‌ ప్రముఖ జర్నలిస్టుగా ఉంటూ చాలాకాలంగా ప్రజా సమస్యల్ని అధ్యయనం చేసిన వ్యక్తి. 34వ డివిజన్‌కు మహిళ రిజర్వు కావడంతో శ్రావణ్‌ తన భార్య రాదతో కలిసి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నామినేషన్‌ పర్వం ముగిసిందని, ప్రజా క్షేత్రంలోకి వెళ్లే సమయం ఆసన్నమైందన్నారు. ...

Read More »

యూనివర్సిటీలో చిరుత కలకలం

డిచ్‌పల్లి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఎంసిఏ బిల్డింగ్‌ వద్ద చిరుత కనిపించినట్టు కొందరు చెప్పడంతో అటవీ, పోలీస్‌ శాఖల అధికారులు యూనివర్సిటీలో గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచార వార్తలతో శుక్రవారం జరగాల్సిన పీజీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రకటించారు.

Read More »

నెల రోజుల్లో అన్ని రహదారుల ప్లాంటేషన్‌ పూర్తికావాలి

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బి, నేషనల్‌ హైవే రహదారులకు ఇరువైపుల మీడియంలో పూర్తిస్థాయి మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి మాణిక్‌ బండార్‌, మామిడిపల్లి, రామచంద్ర పల్లి, అంకాపూర్‌, పెర్కిట్‌, అమీనాపూర్‌, వేల్పూర్‌, పడగల్‌, వన్నెల్‌.బి, పోచంపాడ్‌, అర్గుల్‌, సికింద్రాపూర్‌ పరిధిలో రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ నెల రోజుల్లోగా అన్ని రహదారులకు ఎటువంటి గ్యాప్‌ లేకుండా ఆకర్షణీయమైన గుబురుగా ఉండే ...

Read More »

ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లాస్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 08462-223545 లేదా 08462-254001 ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌లకు కాల్‌ చేసి మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ఏమైనా ఫిర్యాదులు చేయవచ్చని సమాచారం పొందవచ్చని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

Read More »

సిపిఎం అభ్యర్థి గోవర్దన్‌ నామినేషన్‌

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 14 వ డివిజన్‌ సిపిఎం అభ్యర్థి ఎం.గోవర్ధన్‌ నామినేషన్‌ సందర్భంగా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ దాఖలు చేశారు. భగత్‌సింగ్‌ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీ కొనసాగించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో మత వైషమ్యాలను బిజెపి ప్రేరేపిస్తుందని, ప్రజా సమస్యల పట్ల టిఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం చేస్తూ పేదలకు ఇండ్ల స్థలాలు కానీ ...

Read More »

11, 12 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం, ఆదివారం అనగా 11, 12 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న, ఆపైన వయస్సు గల వారందరూ ఓటరు జాబితాలో వారి పేర్లు లేకుంటే కొత్తగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. అంతేకాక ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ రెండు ...

Read More »

్జజి.ఆర్‌.మెమోరియల్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జి. ఆర్‌. మెమోరియల్‌ సంస్థ ఆద్వర్యంలో శుక్రవారం నిజామాబాదు నగరంలోని బస్వా గార్డెన్స్‌లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పి చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిద రంగాలలో సేవలందించిన వారిని సన్మానించారు. జిఆర్‌ మెమోరియల్‌ అధ్యక్షులు నరేష్‌ బాబు, కార్యదర్శి భైరయ్య, ప్రొఫెసర్‌ డా.త్రివేణి, వినోద్‌ కుమార్‌, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Read More »