Breaking News

Daily Archives: January 11, 2020

గల్ఫ్‌ కార్మికుని మతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి

జగిత్యాల, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన జంగ సుదర్శన్‌ అనే గల్ఫ్‌ కార్మికుడు షార్జాలో వారం క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన పనిచేసే కంపనీ సుదర్శన్‌ మతదేహాన్ని స్వదేవానికి పంపించడానికి సహకరించలేదు. అంతేకాక మతదేహానికి అయ్యే ఖర్చులు కూడా పెట్టమని తేల్చిచెప్పారు. దీంతో మరణించిన వ్యక్తి యొక్క గ్రామస్తుడు భాదినేని వేంకటేశ్‌ ముందుకు వచ్చి శవాన్ని స్వదేశానికి పంపించటానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని విరాళాల రూపంలో జమచేసి మతదేహాన్ని ...

Read More »

కాంగ్రెస్‌లోకి చీల ప్రభాకర్‌

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, సంఘసేవకుడు చీల ప్రభాకర్‌ టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శ్రీనివాసరావు, పీసీసి సెక్రటరీ ఎంజీ వేణుగోపాల్‌ గౌడ్‌, గూడెం శ్రీనివాస్‌ రెడ్డి, మహమ్మద్‌ నయీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 43 వ వార్డు నుండి చీల ప్రభాకర్‌ కోడలు చీల రచనను కౌన్సిలర్‌ అభ్యర్థిగా ప్రకటించారు.

Read More »

చిరుత కోసం గాలింపు…

డిచ్‌పల్లి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని అటవీప్రాంతంలో చిరుత సంచరిస్తున్న విషయం తెలిసిందే. స్థానిక రైతులు, ఓ విద్యార్థి చిరుత కనిపించినట్టు రిజిస్ట్రార్‌కు తెలపడంతో ఆచార్య నసీం అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా శుక్రవారం ఉదయం నుంచి అటవీశాఖాధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. ఎంబిఎ కళాశాల పరిసర ప్రదేశం నుంచి హనుమాన్‌ ఆలయం, కొప్పు మల్లన్న గుట్ట వరకు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు బీట్‌ ఆఫీసర్‌ పోచన్న, వినోద్‌, శేఖర్‌, జయరాల, ...

Read More »

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతకు స్పూర్తి ప్రధాత స్వామీ వివేకానందుడని ఉమ్మడి జిల్లాల తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.బాలాజీ రావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాంధీపని కళాశాలలో జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ ఇందూర్‌ సంస్థ ఆద్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బాలాజీరావు ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. వివేకానందుని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదివి స్పూర్తి పొందాలని సూచించారు. భారత దేశ ...

Read More »

నెలాఖరు వరకు పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఫార్మల్‌గా మాత్రమే ఈ నెల 12 న ముగిస్తున్నామనీ దీని పనులన్నీ పూర్తయ్యే వరకు నెలాఖరు వరకు కొనసాగిస్తూ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి, జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడారు. ఇందులో నిర్దేశించుకున్న డంపింగ్‌ యార్డులు, స్మశాన వాటికలు, ఇంటింటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తి చేయించాలన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ...

Read More »

పాలిటెక్నిక్‌ను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంగా పాలిటెక్నిక్‌ కళాశాలను జిల్లా కలెక్టర్‌ పర్యటించి పరిశీలించారు. శనివారం ఆయన అధికారులతో కళాశాలలో పర్యటించి గదులను పరిశీలించారు. ముందుగా కౌంటింగ్‌ హాల్స్‌గా ఎంపిక చేస్తే ఏ విధంగా ఉంటుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గతంలో పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివి బీటెక్‌ అనంతరం 18 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించిన వైష్ణవిని అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ చదువుకోవాలనే ...

Read More »

ప్రత్యేక వోటరు నమోదును పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శనివారం ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. శనివారం పాలిటెక్నిక్‌ కళాశాలలో, ముబారక్‌ నగర్‌ లోని జెడ్‌పిహెచ్‌ఎస్‌ పాఠశాలలోనూ పర్యటించి కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక సంవత్సరం పూర్తయినందున జనాభాలో కనీసం మూడు శాతం ఓటరుగా అర్హత సాధిస్తారని ...

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ బి.ఏ, బి.కాం, బిఎస్‌సి, బిబిఏ 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 2వ, 4వ, 6వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా శనివారం ఉదయం జరిగిన పరీక్షల్లో మొత్తం 3789 మంది విద్యార్థులకుగాను, 3580 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 209 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్‌లో ఒకరు ...

Read More »

అన్ని పనులు పూర్తి చేస్తే మళ్లీ వస్తా

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో ఉద్దేశించిన పనులన్నీ ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తే మీ గ్రామానికి మళ్ళీ వచ్చి సమావేశం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాక్లూర్‌ మండల కేంద్రంలో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమాలపై సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌, ప్రజలు అంగన్‌వాడి కేంద్రాలకు నిధులు కావాలని కోరారు. అందుకు కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతి రెండవ విడతలో నిర్దేశించిన ...

Read More »

13వ తేదీ సోమవారం ప్రజావాణి ఉండదు

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే సోమవారం 13వ తేదీన ప్రజావాణి కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి అధికారులు విధుల్లో నిమగ్నమై ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదుల కోసం వచ్చే ప్రజలు విషయాన్ని గమనించాలని ప్రకటనలో కలెక్టర్‌ కోరారు.

Read More »