నెలాఖరు వరకు పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఫార్మల్‌గా మాత్రమే ఈ నెల 12 న ముగిస్తున్నామనీ దీని పనులన్నీ పూర్తయ్యే వరకు నెలాఖరు వరకు కొనసాగిస్తూ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి, జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడారు. ఇందులో నిర్దేశించుకున్న డంపింగ్‌ యార్డులు, స్మశాన వాటికలు, ఇంటింటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తి చేయించాలన్నారు.

అదేవిధంగా ప్రతి గ్రామంలో నర్సరీలలో మొక్కలను పెంచడానికి చర్యలు తీసుకోవడంతో పాటు మొదటి విడతలో నాటిన మొక్కలు ఏవైనా చనిపోయి ఉంటే వాటి స్థానంలో కొత్తవి నాటించాలని, ప్రతి ఇంటికి తడి పొడి చెత్త బుట్టలు అందించాలని ఆదేశించారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామంలో మొక్కలతో పచ్చదనం వెల్లివిరియాలని పేర్కొన్నారు.

ఎక్కడ కూడా ప్లాస్టిక్‌ కనిపించకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, మోరీలు శుభ్రం చేయాలని, చెత్తను ఎత్తాలని డంపింగ్‌ యార్డులకు తరలించాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచి అవసరమైతే రంగులు వేయించాలి సూచించారు. గ్రామంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల నుండి, గ్రామ పెద్దల నుండి విరాళాలు సేకరించి గ్రామాభివద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ ట్రాలీ, ట్యాంకర్‌ సమకూర్చుకోవాలని ఈ పనులను నెలాఖరు వరకు కొనసాగిస్తూ పల్లె ప్రగతిలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. ఇంకా ఎక్కడైనా గ్యాప్‌ ఉంటే సంబంధిత అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆకస్మికంగా ఏ గ్రామానికైనా రానున్నానని తెలిపారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *