Breaking News

చిరుత కోసం గాలింపు…

డిచ్‌పల్లి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని అటవీప్రాంతంలో చిరుత సంచరిస్తున్న విషయం తెలిసిందే. స్థానిక రైతులు, ఓ విద్యార్థి చిరుత కనిపించినట్టు రిజిస్ట్రార్‌కు తెలపడంతో ఆచార్య నసీం అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా శుక్రవారం ఉదయం నుంచి అటవీశాఖాధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.

ఎంబిఎ కళాశాల పరిసర ప్రదేశం నుంచి హనుమాన్‌ ఆలయం, కొప్పు మల్లన్న గుట్ట వరకు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు బీట్‌ ఆఫీసర్‌ పోచన్న, వినోద్‌, శేఖర్‌, జయరాల, యూనివర్సిటీ ఎస్టేట్‌ ఆఫీసర్‌ యాదగిరి, సెక్యురిటి గార్డులు గాలించారు. శనివారం ఉదయం నుంచి రిజిస్ట్రార్‌ తన చాంబర్‌ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు.

అంతేకాకుండా కొప్పుగుట్ట పరిసరాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత ఉన్నట్టు ఆధారాలు దొరికితే ప్రత్యేక బృందాలను పిలిపిస్తామని పేర్కొన్నారు.

Check Also

ఒకరోజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మరియు ...

Comment on the article