పాలిటెక్నిక్‌ను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంగా పాలిటెక్నిక్‌ కళాశాలను జిల్లా కలెక్టర్‌ పర్యటించి పరిశీలించారు. శనివారం ఆయన అధికారులతో కళాశాలలో పర్యటించి గదులను పరిశీలించారు.

ముందుగా కౌంటింగ్‌ హాల్స్‌గా ఎంపిక చేస్తే ఏ విధంగా ఉంటుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గతంలో పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివి బీటెక్‌ అనంతరం 18 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించిన వైష్ణవిని అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ చదువుకోవాలనే కసి ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ప్రస్తుతం మీ వయసులో టీచర్లు లేకున్నా స్వయంగా చదువుకొని అర్థం చేసుకునే స్థాయికి మీరు వచ్చారన్నారు.

మీరు చదివే విద్యా సంస్థలో సమస్యలు, కుటుంబ నేపథ్యం తదితర ఆలోచనలతో భవిష్యత్తును పాడుచేసుకోకుండా ఉన్న సదుపాయాలతో ఒక లక్ష్యంతో కష్టపడి ముందుకు వెళ్లాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఏదైనా సాధించవచ్చని, ఈ వయసులో రోజుకు 16 గంటలు కష్టపడి చదువుతే కమ్యూనికేషన్‌, లాంగ్వేజ్‌ స్కిల్స్‌లో పరిజ్ఞానాన్ని సంపాదించుకొని బాగా స్థిరపడవచ్చని ఉద్బోధించారు. కారణాలు వెతుక్కోకుండా సక్సెస్‌ కోసం కమిట్‌మెంట్‌తోక కషిచేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

కలెక్టర్‌ వెంట డిఆర్‌ఓ అంజయ్య, ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, ఆర్‌డిఓ వెంకటయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ రామ్‌ కుమార్‌, తదితరులు ఉన్నారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *