ప్రత్యేక వోటరు నమోదును పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శనివారం ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. శనివారం పాలిటెక్నిక్‌ కళాశాలలో, ముబారక్‌ నగర్‌ లోని జెడ్‌పిహెచ్‌ఎస్‌ పాఠశాలలోనూ పర్యటించి కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఒక సంవత్సరం పూర్తయినందున జనాభాలో కనీసం మూడు శాతం ఓటరుగా అర్హత సాధిస్తారని అందుకు అనుగుణంగా బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటికి తిరిగి ఇంకా ఎవరైనా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారు నమోదు చేసుకోకుండా ఉంటే వారి వివరాలను తీసుకొని వారి చేత నమోదు చేయించాలని ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం ఉన్నందున అర్హత గల వయోజనులందరూ వారి పేర్లు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాఠశాలలో పర్యటించి పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సంవత్సరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించబోతున్నామని విద్యార్థులు కష్టపడి చదవాలని, పరీక్షలు బాగా రాయాలని, వేరే రకంగా ఊహించుకొని చదువుకోకుండా ఉండ వద్దన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డిఓ వెంకటయ్య, తహసిల్దార్‌ తదితరులు ఉన్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *