Breaking News

అన్ని పనులు పూర్తి చేస్తే మళ్లీ వస్తా

నిజామాబాద్‌, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో ఉద్దేశించిన పనులన్నీ ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తే మీ గ్రామానికి మళ్ళీ వచ్చి సమావేశం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాక్లూర్‌ మండల కేంద్రంలో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమాలపై సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌, ప్రజలు అంగన్‌వాడి కేంద్రాలకు నిధులు కావాలని కోరారు.

అందుకు కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతి రెండవ విడతలో నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేస్తే దాని గురించి చర్యలు తీసుకుంటారన్న వైకుంఠ ధామాలు, స్మశాన వాటికలు, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయించాలని వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. పనులన్నీ పూర్తి చేస్తే ఫిబ్రవరిలో అధికారులతో వచ్చి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. విద్యుత్‌ శాఖ కార్యాలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై సహాయ ఇంజనీర్‌కు మెమో జారీ చేయాలన్నారు.

ముందుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వచ్చే ప్రజలకు టాయిలెట్స్‌, త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పల్లె ప్రగతి రెండవ విడత కార్యక్రమాలను ఈ నెల 12న ఫార్మల్‌ గానే ముగుస్తున్నప్పటికీ నెలాఖరు వరకు పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. మాక్లూర్‌ తహసిల్దార్‌ కార్యాలయంలో పర్యటించిన ఆయన కలెక్టర్‌ కార్యాలయానికి పంపించే లేఖల పెట్టను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ ఆలోచన బాగుందన్నారు. అందులో వేసే లేఖలు సీలు వేయాలని బోర్డు పెట్టవలసిందిగా సూచించారు. ఈ ఆలోచన వల్ల కలెక్టరేట్‌కు ఫిర్యాదు చేసే లేదా లేఖలు సమర్పించే ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చే అవసరం లేకుండా ఇక్కడే అందించడానికి వీలవుతుందన్నారు. తద్వారా ప్రజల వ్యయ ప్రయాసలు తప్పుతాయన్నారు. కార్యక్రమాల్లో తహసిల్దార్‌ ఆంజనేయులు, ఎంపీడీవో సక్రియ, ఎంపిఓ వెంకటరమణ, సర్పంచ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

నత్త నడక పనుల‌పై కలెక్టర్‌ అసహనం

నిజామాబాద్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద ప్రభుత్వ శాఖలు పనుల‌ను గుర్తించి, ఎస్టిమేట్లు ...

Comment on the article