Breaking News

గల్ఫ్‌ కార్మికుని మతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి

జగిత్యాల, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన జంగ సుదర్శన్‌ అనే గల్ఫ్‌ కార్మికుడు షార్జాలో వారం క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన పనిచేసే కంపనీ సుదర్శన్‌ మతదేహాన్ని స్వదేవానికి పంపించడానికి సహకరించలేదు. అంతేకాక మతదేహానికి అయ్యే ఖర్చులు కూడా పెట్టమని తేల్చిచెప్పారు.

దీంతో మరణించిన వ్యక్తి యొక్క గ్రామస్తుడు భాదినేని వేంకటేశ్‌ ముందుకు వచ్చి శవాన్ని స్వదేశానికి పంపించటానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని విరాళాల రూపంలో జమచేసి మతదేహాన్ని స్వదేశానికి పంపడానికి నిర్ణయించుకున్నారు. మృతదేహాన్ని ఇంటికి తొందరగా పంపాలని గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నరసింహకు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన బాదినేని వెంకటేష్‌ని కలిసి వివరాలు తెలుసుకొని అన్ని పనులు దగ్గరుండి పూర్తి చేయించి శనివారం మతదేహాన్ని స్వదేశానికి పంపించారు.

హైదరాబాద్‌ విమానాశ్రయం నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం కూడ కల్పించారు. మతుని యొక్క కంపెనీ కార్మికులు విరాళాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో మాదాపూర్‌ గ్రామస్తులు బాదినేని కాశీరాం, బాదినేని వెంకటేష్‌, బాదినేని మల్లారెడ్డి, శ్రీకాంత్‌, గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండేల్లి నర్సింహా, ఉపాధ్యక్షులు శేఖర్‌ గౌడ్‌, దొనకంటి శ్రీనివాస్‌, కనకట్ల రవీందర్‌, షేక్‌ వల్లి, మునిందర్‌, అశోక్‌ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్‌ గౌడ్‌, ప్రవీణ్‌ చేర్యాల, నరేందర్‌ రెడ్డి, సాన లక్ష్మణ్‌, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్‌, గోవర్ధన్‌ యాదవ్‌, గనెష్‌, మనెళ్లి ప్రసాద్‌, అజయ్‌, హరిశ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *