Breaking News

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

కామారెడ్డి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతకు స్పూర్తి ప్రధాత స్వామీ వివేకానందుడని ఉమ్మడి జిల్లాల తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.బాలాజీ రావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాంధీపని కళాశాలలో జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ ఇందూర్‌ సంస్థ ఆద్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి బాలాజీరావు ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. వివేకానందుని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదివి స్పూర్తి పొందాలని సూచించారు. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడని ఆన్నారు. దేశ గొప్పదనం తెలుసుకోవాలంటే వివేకానందుని గురించి తెల్సుకోవాలని, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చెప్పిన మాటలను ఈ సందర్భంగా బాలాజీరావు గుర్తు చేశారు.

విద్యార్థులు సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఉద్బోదించారు. సాంధీపని కళాశాల డైరెక్టర్‌ అశోక్‌ రావు, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్‌లు సాయిబాబా, ప్రవీణ్‌ కుమార్‌, జేసిఐ ఇందూర్‌ అధ్యక్ష, కార్యదర్శులు తిరునగరి శ్రీహరి, తక్కూరి హన్మాండ్లు, పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్‌, ప్రోగ్రాం చైర్మెన్‌ నరహరి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *