Breaking News

Daily Archives: January 12, 2020

భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా..?

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? అనే విషయం చాలామందికి తెలీదు. ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే.. వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పళ్లు పోయడం, సాయంత్రం సంది గొబ్బెలు పిల్లల చేత పెట్టించిన తర్వాత ఈ భోగి పళ్లు చేసే కార్యక్రమం మొదలుపెడతారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఎక్కువగా భోగిపళ్లు ...

Read More »

తోడుగా రండి, సొంతబిడ్డలా ఆదరిస్తా

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 26వ డివిజన్‌ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బంటు వైష్ణవి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తు ప్రజలకు చేరువవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు డివిజన్‌ వాసులు మాట్లాడుతూ చాలీ చాలనీ జీతాలతో, సొంత ఇల్లులేక ఇబ్బందులు పడుతున్నానమని, పిల్లల్ని సరిగా చదివించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన అభ్యర్థి కేంద్ర ప్రభుత్వ ఆవాస్‌ యోజన ద్వారా ఇళ్ళ ...

Read More »

ఎన్నికల ప్రచారంలో నిజాంసాగర్‌ నాయకులు పాల్గొనాలి

నిజాంసాగర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో నిజాంసాగర్‌ మండల టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని టీఆర్‌ఎస్‌ పార్టీ విజయానికి కషి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంత్‌ సిండే ఆదేశానుసారం ఆదివారం నిజాంసాగర్‌ మండల కేంద్రంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ గెలుపునకు కషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు సాధుల సత్యనారాయణ, సిడిసి ...

Read More »

యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానంద

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నిజామాబాదు నగరంలోని గాజుల్‌ పేట్‌లో స్వామి వివేకానంద విగ్రహానికి జేసిఐ సభ్యులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జేసిఐ ఇందూర్‌ అధ్యక్షుడు తిరునగరి శ్రీహరి మాట్లాడుతూ యువతకు స్పూర్తి ప్రధాత స్వామీ వివేకానందుడని అన్నారు. వివేకానందుని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదివి స్పూర్తి పొందాలని సూచించారు. జేసిఐ ఇందూర్‌ పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్‌, కార్యదర్శి తక్కూరి ...

Read More »

ఇప్పకాయల సుదర్శన్‌కు వివేకానంద పురస్కారం

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాంబత్రి గంగారాం మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆద్వర్యంలో ఆదివారం సాయంత్రం స్వామి వివేకానంద జయంతిని నిజామాబాదు నగరంలోని జిల్లా పద్మశాలి సంఘ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాద్యాయులు ఇప్పకాయల సుదర్శన్‌కు వివేకానంద పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి గిరిరాజ కళాశాల విశ్రాంత ఉపన్యాసకులు శేర్ల దయానంద్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన వివేకానందుడు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. కార్యక్రమంలో రాంబత్రి గంగారాం మెమోరియల్‌ ట్రస్ట్‌ అద్యక్ష, కార్యదర్శులు ...

Read More »

పల్లెప్రగతిలో నర్సరీ ప్రారంభం

బాన్సువాడ, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జడ్పీటీసీ పద్మ గోపాల్‌ రెడ్డితో కలిసి బాన్సువాడ మండలం ఇబ్రాహీంపెట్‌, ఇబ్రాహీంపెట్‌ తాండ, కొనపూర్‌, సోంలనాయక్‌ తాండ, మొగులాన్పల్లి తాండ, తిర్మలాపూర్‌ తదితర గ్రామాల్లో ఎంపిపి నీరజ వెంకట్‌రాంరెడ్డి పల్లెప్రగతిలో పాల్గొన్నారు. ఇబ్రాహీంపెట్‌ గ్రామంలో నర్సరీ ప్రారంభించి, డంపింగ్‌ యార్డు పరిశీలించారు. అలాగే మొగులాన్‌ పల్లి, తిర్మలాపూర్‌ గ్రామాల్లో చెత్త బుట్టల పంపిణీ చేసి డంపింగ్‌ యార్డ్‌ పరిశీలించారు. అదేవిధంగా సోంలనాయక్‌ తాండ, కొనపూర్‌ గ్రామాల్లో నర్సరీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, ...

Read More »

తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురు తెరాస నుండి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లింగాపూర్‌ గ్రామానికి చెందిన 11వ వార్డు నుండి తెరాస డైరెక్టర్‌ మంగలి లింగం, ప్రభాకర్‌, దీరణ్‌ రెడ్డి, మంగలి రాజయ్య, మంగలి విట్టల్‌, లక్ష్మీనరసింహులు, దూస బాలరాజ్‌ తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అలాగే లింగాపూర్‌ అధ్యక్షులు బాల్‌ రెడ్డి, యాదవ రెడ్డి కొమిరెడ్డి నారాయణ జంపాల ప్రసాద్‌ ఆధ్వర్యంలో పిసిసి సెక్రటరీ ఎంజి ...

Read More »

కాంగ్రెస్‌పార్టీ బి ఫారాలు అందజేత

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో పిసిసి కార్యదర్శి వేణుగోపాల్‌గౌడ్‌ బాన్సువాడ కాంగ్రెస్‌ నాయకులకు బి ఫారాలు అందజేశారు. సోమవారం బాన్సువాడలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు కాసుల బాలరాజు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఫిరంగి రాజేశ్వర్‌ మొహమ్మద్‌ నయీమ్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

రాంపూర్‌లో పల్లె ప్రగతి

ఆర్మూర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. సమావేశానికి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డిఆర్‌డివో రమేష్‌ రాథోడ్‌, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీ రాములు పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన పనుల గురించి తెలుసుకున్నారు. గ్రామంలో పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త పొడి చెత్త సేకరణ, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించు కోవాలని సూచించారు. గ్రామాభివద్ధికి విరాళం అందజేసిన దాతలను సన్మానించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ...

Read More »

అస్వస్థకు గురైన నెమలిని అటవీశాఖ అధికారులకు అప్పగింత

రెంజల్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలాక్యాంప్‌ శివారులో సంచరిస్తున్న జాతీయ పక్షి నెమలి అస్వస్థకు గురికావడంతో గమనించిన మండల కో ఆప్షన్‌ సభ్యుడు అంతయ్య ఆదివారం పోలీస్‌ స్టేషన్లో సిబ్బందికి అప్పగించారు. పంట పొలాల్లో రైతులు మందులు పిచికారి చేసిన నీటిని సేవించి నెమలి అస్వస్థతకు గురైంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నెమలిని గుర్తించిన అంతయ్య నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. దీంతో రెంజల్‌ ఎస్‌ఐ శంకర్‌ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పోలీస్‌ ...

Read More »

ఘనంగా వివేకానంద జయంతి

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గాజుల్‌పేట్‌ చౌరస్తాలోని స్వామీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 27వ డివిజన్‌ తెరాస అభ్యర్థి రంగు సీతారాం మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శమన్నారు. ఆయన బాటలో నడిచి భారతదేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పాలన్నారు. ఆయన వెంట మెగా శ్రీను, ఆకాష్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, సుహాన్‌ తదితరులున్నారు.

Read More »

పల్లె ప్రగతికి పూర్వ విద్యార్థుల విరాళం

ధర్పల్లి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ధర్పల్లికి చెందిన పూర్వ విద్యార్థులు 12 వేల రూపాయల విరాళం అందజేశారు. స్థానిక జడ్‌పిహెచ్‌ఎస్‌లో చదువుకున్న 2006-07 పదవ తరగతి బ్యాచ్‌ విద్యార్థులు కలిసి ఆదివారం సర్పంచ్‌ బాల్‌రాజుకు నగదు అందజేశారు. పల్లె ప్రగతికి పూర్వ విద్యార్థులు విరాళం అందజేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి సారిక, చాట్ల ప్రణీత్‌, రాము, సంజీవ్‌, చిరంజీవి, జాఫర్‌ తదితరులున్నారు.

Read More »

బీసీలు ఐక్యంగా పోరాడాలి

జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మోర్తాడ్‌లోని ప్రజానిలయంలో బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్‌ జిల్లా క్యాలెండర్‌ను బహుజన సమాజ్‌ వాదీ పార్టీ నాయకులు ముత్యాల సునీల్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి బీసీ రిజర్వేషన్‌, బీసీ హక్కులకోసం పోరాడాలాన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ అమలు చేయాలని, అప్పుడే బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా జనరల్‌ సెక్రటరీ ద్యాగ శేఖర్‌, బీసీ విద్యార్థి ...

Read More »

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

నిజాంసాగర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శంకరంపేట్‌ – ఎ మండలంలోని మల్కపూర్‌ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) పురస్కరించుకొని అక్కడ ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు యువతకు ఆదర్శవంతమైన జీవనం కొనసాగాలంటే స్వామి వివేకానంద జీవన గమనాన్ని చూడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అత్యంత పిన్న వయసులో ప్రపంచానికి భారత భూమి ఔనత్యాన్ని తెలిపిన మహనీయుడు ...

Read More »

అభివృద్ధిచేస్తా అవకాశమివ్వండి

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా 26వ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తంబాకు చంద్రకళ పోటీ చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌పార్టీలో పనిచేస్తు ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న అభ్యర్థి చంద్రకళ. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్‌ నగర అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ తనను గెలిపిస్తే డివిజన్‌లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వీధి ...

Read More »

మంజీరా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంజీరా ఫౌండేషన్‌ ఆద్వర్యంలో నిజామాబాద్‌లో బ్లాంకెట్స్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో అభాగ్యులకు, నిరాశ్రయులకు వీధి వీధిలో తిరుగుతూ దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ దుప్పట్ల పంపిణీకి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పురుషోత్తంరెడ్డి, జ్యోతి, అర్జున్‌, సతీష్‌, శ్రీకాంత్‌, చంటి తదితరులు పాల్గొన్నారు.

Read More »