తోడుగా రండి, సొంతబిడ్డలా ఆదరిస్తా

నిజామాబాద్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 26వ డివిజన్‌ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బంటు వైష్ణవి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తు ప్రజలకు చేరువవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు డివిజన్‌ వాసులు మాట్లాడుతూ చాలీ చాలనీ జీతాలతో, సొంత ఇల్లులేక ఇబ్బందులు పడుతున్నానమని, పిల్లల్ని సరిగా చదివించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

స్పందించిన అభ్యర్థి కేంద్ర ప్రభుత్వ ఆవాస్‌ యోజన ద్వారా ఇళ్ళ నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తామన్నారు. మీ ఆనందమే నా ఆనందమంటూ ఆశీర్వదించాలని కోరారు. ఆమె వెంట బంటు రాము, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *