భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా..?

నిజామాబాద్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? అనే విషయం చాలామందికి తెలీదు. ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే.. వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పళ్లు పోయడం, సాయంత్రం సంది గొబ్బెలు పిల్లల చేత పెట్టించిన తర్వాత ఈ భోగి పళ్లు చేసే కార్యక్రమం మొదలుపెడతారు.

ఐదేళ్ల లోపు పిల్లలకు ఎక్కువగా భోగిపళ్లు పోస్తారు. రేగు పళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడలు, మొక్కలు కలిపి ఉంచుతారు. వాటిని పిల్లలపై పడేట్టు పోస్తారు. అలా పోసిన తర్వాత కింద బిడ్డ రేగిపళ్లు తినడానికి నిషిద్ధం. దాన్ని ఎవరూ లేని చోట పారేయడం చేస్తారు.

అసలు పిల్లలకు భోగి పళ్ల పేరుతో రేగి పళ్లనే ఎందుకు పోస్తారు? అనేది కూడా చాలామందికి తెలియని విషయమే. రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే.. ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *