అభివృద్ధిచేస్తా అవకాశమివ్వండి

నిజామాబాద్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా 26వ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తంబాకు చంద్రకళ పోటీ చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌పార్టీలో పనిచేస్తు ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న అభ్యర్థి చంద్రకళ. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్‌ నగర అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు.

ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ తనను గెలిపిస్తే డివిజన్‌లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, నల్లాలు తదితర మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. కార్పొరేటర్‌గా అవకాశమిచ్చి తనను గెలిపించాలని కోరారు.

ఆమె వెంట యూత్‌ కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు సాగర్‌, మహిళా నాయకులు, తదితరులున్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *