ఘనంగా వివేకానంద జయంతి

నిజామాబాద్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గాజుల్‌పేట్‌ చౌరస్తాలోని స్వామీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 27వ డివిజన్‌ తెరాస అభ్యర్థి రంగు సీతారాం మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శమన్నారు. ఆయన బాటలో నడిచి భారతదేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పాలన్నారు. ఆయన వెంట మెగా శ్రీను, ఆకాష్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, సుహాన్‌ తదితరులున్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *