Breaking News

ఎన్నికల ప్రచారంలో నిజాంసాగర్‌ నాయకులు పాల్గొనాలి

నిజాంసాగర్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో నిజాంసాగర్‌ మండల టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని టీఆర్‌ఎస్‌ పార్టీ విజయానికి కషి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంత్‌ సిండే ఆదేశానుసారం ఆదివారం నిజాంసాగర్‌ మండల కేంద్రంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ గెలుపునకు కషి చేయాలని తెలిపారు.

కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు సాధుల సత్యనారాయణ, సిడిసి చైర్మన్‌ గంగారెడ్డి, నాయకులు దుర్గారెడ్డి, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌, ఎంపిటిసిలు, సర్పంచ్‌ పాల్గొన్నారు.

Check Also

ఏబీవిపి ఆధ్వర్యంలో గుడ్లు, బిస్కెట్లు పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *