Breaking News

ఇప్పకాయల సుదర్శన్‌కు వివేకానంద పురస్కారం

నిజామాబాద్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాంబత్రి గంగారాం మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆద్వర్యంలో ఆదివారం సాయంత్రం స్వామి వివేకానంద జయంతిని నిజామాబాదు నగరంలోని జిల్లా పద్మశాలి సంఘ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాద్యాయులు ఇప్పకాయల సుదర్శన్‌కు వివేకానంద పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి గిరిరాజ కళాశాల విశ్రాంత ఉపన్యాసకులు శేర్ల దయానంద్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన వివేకానందుడు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. కార్యక్రమంలో రాంబత్రి గంగారాం మెమోరియల్‌ ట్రస్ట్‌ అద్యక్ష, కార్యదర్శులు రాంబత్రి గంగాధర్‌, మచ్చ రవి, తెలుగు వెలుగు అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ట్రస్ట్‌ ప్రతినిధులు సైబ నరహరి, చింతల గంగాదాస్‌, కాముని గంగాధర్‌, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏబీవిపి ఆధ్వర్యంలో గుడ్లు, బిస్కెట్లు పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *