Breaking News

యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానంద

నిజామాబాద్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నిజామాబాదు నగరంలోని గాజుల్‌ పేట్‌లో స్వామి వివేకానంద విగ్రహానికి జేసిఐ సభ్యులు పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా జేసిఐ ఇందూర్‌ అధ్యక్షుడు తిరునగరి శ్రీహరి మాట్లాడుతూ యువతకు స్పూర్తి ప్రధాత స్వామీ వివేకానందుడని అన్నారు. వివేకానందుని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదివి స్పూర్తి పొందాలని సూచించారు.

జేసిఐ ఇందూర్‌ పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్‌, కార్యదర్శి తక్కూరి హన్మాండ్లు, కోశాధికారి డాక్టర్‌ జమాల్‌ పూర్‌ రాజశేఖర్‌, ఉపాద్యక్షులు కె.శ్రీనివాస్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు కోడూరు పద్మ, జూనియర్‌ విభాగం అధ్యక్షురాలు కోడూరు సంకీర్తన, ప్రోగ్రామ్‌ చైర్మెన్‌ నరహరి నాయక్‌, ఆకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *