Breaking News

Daily Archives: January 13, 2020

పల్లె ప్రగతి పనులు కొనసాగించాలి

రెంజల్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులను ఎప్పటికి కొనసాగించాలని మండల అభివృద్ది అదికారి గోపాలకృష్ణ అన్నారు. మండల పరిసత్‌ కార్యాలయంలో సోమవారం సర్పంచ్‌లు, కార్యదర్శులు, పీల్డ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ముమ్మరంగా నిర్వహించారని తెలిపారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పదకొండు రోజులుగా గ్రామాల్లో అనేక సమస్యలను పరిష్కరించారని, మిగిలిన పనులు యథాతథంగా కొనసాగే విధంగా ...

Read More »

పల్లె ప్రగతికి దాతల విరాళాలు

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ గ్రామాల అభివద్ధికి, పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుకు తమ వంతుగా విరాళాలు అందించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5న అన్ని గ్రామాల్లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అపూర్వ స్పందన రావడంతో పాటు కోటి అరవై లక్షల రూపాయల నగదు విరాళాలు అందిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇంకా కూడా విరాళాలు అందిస్తూనే ఉన్నారు. సోమవారం కలెక్టర్‌ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. ...

Read More »

బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ పక్కాగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో సిడిఎంఎ శ్రీదేవి, కార్యదర్శి అశోక్‌ కుమార్‌తో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు. బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ అత్యంత ముఖ్యమైనదని, చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వద్దని, నోడల్‌ అధికారులతో పర్యవేక్షణ చేయించాలని తెలిపారు. గుర్తింపు పొందిన, రిజిస్టర్‌ ...

Read More »

భైంసాలో ఇంటర్‌నెట్‌ సేవలు బంద్‌

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైంసాలో ఆదివారం అర్ధ రాత్రి ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లకు అల్లరిమూకలు నిప్పుపెట్టినట్టు సమాచారం. 12వ తేదీ ఆదివారం ఒకవర్గానికి చెందిన కొందరు అల్లరిమూకలు మరో వర్గాన్ని రెచ్చగొట్టడం కోసం బైక్‌పై తిరుగుతూ వీధిలో హంగామా సృస్టించారు. దీంతో స్థానికులు మందలించి వదిలేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు ప్రణాళిక బద్దంగా దాడిచేశారని స్థానికులు అంటున్నారు. ఒకవర్గానికి చెందిన వారున్న ...

Read More »

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఆర్మూర్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020 నూతన సంవత్సరపు క్యాలెండర్‌ని ప్రైవేట్‌ స్కూల్‌ పీఈటీలు ఎంఈఓ పింజ రాజా గంగారం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రైవేట్‌ స్కూల్‌ పిఈటి ప్రెసిడెంట్‌గా సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌ పీఈటీ అనిల్‌ కుమార్‌ను ఎన్నుకున్నారు. అలాగే సెక్రెటరీగా ఎర్రం సురేష్‌, పిఈటి విజయ్‌ హై స్కూల్‌ను ఎన్నుకున్నారు. అలాగే వైస్‌ ప్రెసిడెంట్‌గా బాజాం రాజేశ్వర్‌, పిఈటి జెడ్‌పిహెచ్‌ఎస్‌ మామిడిపల్లిని జాయింట్‌ సెక్రటరీగా, బ్రిజేష్‌ రాజ్‌ పిఈటి క్షత్రియ కాలేజ్‌ను ఎన్నుకున్నారు. ట్రెజరర్‌గా కిరణ్‌ ...

Read More »

ఫార్మాసిస్ట్‌ సస్పెన్షన్‌కు కలెక్టర్‌ ఆదేశం

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చంద్రశేఖర్‌ కాలనీలోని అర్బన్‌ పబ్లిక్‌ హెల్త్‌లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌ వినోద్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. సోమవారం ఆయన ఆకస్మికంగా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్‌ ఆఫీసర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఆలస్యంగా వచ్చినందుకు కారణాలు అడిగారు. హాజరు పట్టిక ప్రకారం ఫార్మాసిస్ట్‌ వినోద్‌ కుమార్‌ అనధికారికంగా గైర్హాజరు కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి అతనిని సస్పెండ్‌ చేయవలసినదిగా ...

Read More »

జిల్లాను జీరో వేస్ట్‌ కాన్సెప్ట్‌ వైపు తీసుకెళ్లడమే లక్ష్యం

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని రకాల వధాను తిరిగి ఉపయోగించి జిల్లాను జీరో వేస్ట్‌ పైపు తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ‘మన ఆకాశవాణి మన నిజామాబాద్‌’ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక రేడియో స్టేషన్లో ప్రజలతో మాట్లాడారు. ఈ నెల 2 నుండి 12 వరకు నిర్వహించిన రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని, గ్రామాలన్నీ పరిశుభ్రంగా ...

Read More »

మా ఊరి మహరాజు యలవర్తి రాజబాపయ్య

నందిపేట్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ పిలుపు మేరకు గ్రామ అభివద్ధి కోసం లక్ష రుపాయల పైన విరాళంగా ఇచ్చిన వారికి ‘మా ఊరి మహరాజు’ పేరుతో సత్కరించడం జరుగుతుందనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం నందిపేట మండలం ఆంధ్రనగర్‌ గ్రామాభివృద్ధి కోసం యలవర్తి రాజబాపయ్య ఒక లక్ష ఒకవెయ్యి నూటపదహారు రూపాయలు విరాళంగా అందజేశారు. జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి చేతులమీదుగా 101116 రూపాయలు సర్పంచ్‌ నాయుడు రామారావుకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు నందిపేట ...

Read More »

విద్యార్థి నాయకుడు రంగు సీతారాం

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 27డివిజన్‌ ఆనంద్‌ నగర్‌లో తెరాస కార్పొరేటర్‌ అభ్యర్థి రంగు సీతారాం సోమవారం స్థానిక ప్రజలతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రంగు సీతారాం విద్యార్థి దశనుంచే ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సైనికునిలా పనిచేశారని పేర్కొన్నారు. సీతారాం లాంటి యువతకు, చదువుకున్న వారికి ఓటు వేసి గెలిపించాలని అప్పుడే ...

Read More »