బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ పక్కాగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో సిడిఎంఎ శ్రీదేవి, కార్యదర్శి అశోక్‌ కుమార్‌తో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు.

బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ అత్యంత ముఖ్యమైనదని, చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వద్దని, నోడల్‌ అధికారులతో పర్యవేక్షణ చేయించాలని తెలిపారు. గుర్తింపు పొందిన, రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌లకు కేటాయించిన గుర్తులు ఆల్ఫాబెటికల్‌గా వారి పేర్లలో ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా పక్కాగా ఎన్నికల నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు.

అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని అవసరమైన చోట్ల పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ రికార్డింగ్‌ చేయించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ బ్యాలెట్‌ పత్రాల టీం ప్రింటింగ్‌ ప్రెస్‌ పరిశీలించాలని, ప్రింటింగ్‌ పత్రాలు జాగ్రత్తగా ఉండేలా చూడాలని, ప్రింటింగ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనలకు అనుగుణంగా గుర్తులు కేటాయించాలని, కార్యక్రమాలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించుకోవాలి సూచించారు.

ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందించి వాటిని తిరిగి స్వీకరించాలని, ఓటర్‌ స్లిప్పులు ప్రభుత్వ అధికారుల ద్వారానే పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 16న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. క్రిటికల్‌, సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వార్డుకు ఒకటి చొప్పున కౌంటింగ్‌ టేబుల్‌ ఏర్పాటు చేయాలన్నారు.

పోలింగ్‌కు, కౌంటింగ్‌కు అవసరమైన పోలీసు బందోబస్తు చేసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో గందరగోళానికి తావులేకుండా ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక టేబుల్‌ వేసి అక్కడ పోలింగ్‌ కేంద్రం నంబర్‌ రాసి అక్కడికే ఎలక్షన్‌ మెటీరియల్‌ అందించే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. రిసెప్షన్‌ కేంద్రాలను వీలైనన్ని ఎక్కువ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వికలాంగుల కొరకు అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ర్యాంపులు, ట్రై సైకిళ్లు ఉంచాలన్నారు.

కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, మున్సిపల్‌ కమిషనర్లు జాన్‌ సాంసన్‌, శైలజ, స్వామి, గంగాధర్‌, ఆర్డీవోలు శ్రీనివాస్‌, గోపి రామ్‌, జిల్లా అధికారులు సీఈవో గోవిందు, డిఆర్‌డిఓ రమేష్‌, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *