ఫార్మాసిస్ట్‌ సస్పెన్షన్‌కు కలెక్టర్‌ ఆదేశం

నిజామాబాద్‌, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చంద్రశేఖర్‌ కాలనీలోని అర్బన్‌ పబ్లిక్‌ హెల్త్‌లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌ వినోద్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. సోమవారం ఆయన ఆకస్మికంగా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్‌ ఆఫీసర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఆలస్యంగా వచ్చినందుకు కారణాలు అడిగారు.

హాజరు పట్టిక ప్రకారం ఫార్మాసిస్ట్‌ వినోద్‌ కుమార్‌ అనధికారికంగా గైర్హాజరు కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి అతనిని సస్పెండ్‌ చేయవలసినదిగా ఆదేశించారు. అకౌంటెంట్‌ వందన కూడా గైర్హాజరు కావడం పరిశీలించారు. అయితే వందన మెడికల్‌ చెకప్‌కు వెళ్లినందున ఆమెకు మెమో జారీ చేయవలసిందిగా ఆదేశించారు. అదేవిధంగా ఉదయం 9 గంటలకు విధులకు రావలసిన డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, అటెండర్‌ చాంద్‌ పాషా కలెక్టర్‌ వచ్చిన తర్వాత ఆలస్యంగా రావడంతో వారికి కూడా మెమోలు జారీ చేయవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.

హాజర్‌ రిజిస్టర్‌ను, ఆసుపత్రికి వచ్చిన పేషంట్‌ ల వివరాలను పరిశీలించారు. తాను ముందుగా సమయపాలన పాటించడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. మిగతా ఆసుపత్రుల సిబ్బందికి అధికారులకు కూడా తెలియజెప్పాలని లేదంటే చర్యలుంటాయని ఆయన తెలిపారు.

ఆసుపత్రి పరిసరాలలో స్థానిక పోకిరీలు మద్యం సేవించడం, ఇతర న్యూ సెన్స్‌ కార్యక్రమాలు నిర్వహించడం పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏసిపికి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *