Breaking News

పల్లె ప్రగతికి దాతల విరాళాలు

నిజామాబాద్‌, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ గ్రామాల అభివద్ధికి, పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుకు తమ వంతుగా విరాళాలు అందించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5న అన్ని గ్రామాల్లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అపూర్వ స్పందన రావడంతో పాటు కోటి అరవై లక్షల రూపాయల నగదు విరాళాలు అందిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇంకా కూడా విరాళాలు అందిస్తూనే ఉన్నారు.

సోమవారం కలెక్టర్‌ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. మాక్లూర్‌ మండలం చిక్లి గ్రామానికి చెందిన డాక్టర్‌ గోపి కష్ణ, గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యులు, ప్రజలతో కలిసి కలెక్టర్‌ చాంబర్‌లో గ్రామ అభివృద్ధికి ఒక లక్షా 20 వేల రూపాయలు చెక్కును విరాళంగా అందించారు. సిరికొండ మండలం గడ్కోల్‌ గ్రామానికి చెందిన రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌ తన తండ్రి దేవెగౌడ్‌ ద్వారా లక్ష 11వేల రూపాయల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ వారితో మాట్లాడుతూ ఎన్నికల తర్వాత తమ గ్రామాలకు వస్తానని అన్ని గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డ్‌లు, స్మశాన వాటికలు పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామమంతా కదిలితే ఊరు అభివద్ధి చెందుతుందని తెలిపారు. గ్రామాల్లోని విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

Check Also

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ...

Comment on the article