Breaking News

భైంసాలో ఇంటర్‌నెట్‌ సేవలు బంద్‌

నిజామాబాద్‌, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైంసాలో ఆదివారం అర్ధ రాత్రి ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లకు అల్లరిమూకలు నిప్పుపెట్టినట్టు సమాచారం. 12వ తేదీ ఆదివారం ఒకవర్గానికి చెందిన కొందరు అల్లరిమూకలు మరో వర్గాన్ని రెచ్చగొట్టడం కోసం బైక్‌పై తిరుగుతూ వీధిలో హంగామా సృస్టించారు. దీంతో స్థానికులు మందలించి వదిలేశారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు ప్రణాళిక బద్దంగా దాడిచేశారని స్థానికులు అంటున్నారు. ఒకవర్గానికి చెందిన వారున్న కొర్బా వీధిలో పెంకుటిల్లే లక్ష్యంగా దాడిచేసి ఇళ్లను తగులబెట్టడం, లూఠీ చేయడం చేశారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై రాళ్ళు రువ్వారు. ఫైర్‌ ఇంజన్‌ పైపులను ధ్వంసంచేసి నానా భీభత్సం సృష్టించారు.

కాగా పోలీసులకు, సిఐ, డిఎస్‌పికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా దాడుల్లో పాల్పడినవారు నిర్మల్‌, హైదరాబాద్‌ పాత బస్తీలకు చెందినవారు ఒక కార్యక్రమానికి వచ్చినవారు ఉన్నట్టు తెలుస్తుంది.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *