మా ఊరి మహరాజు యలవర్తి రాజబాపయ్య

నందిపేట్‌, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ పిలుపు మేరకు గ్రామ అభివద్ధి కోసం లక్ష రుపాయల పైన విరాళంగా ఇచ్చిన వారికి ‘మా ఊరి మహరాజు’ పేరుతో సత్కరించడం జరుగుతుందనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం నందిపేట మండలం ఆంధ్రనగర్‌ గ్రామాభివృద్ధి కోసం యలవర్తి రాజబాపయ్య ఒక లక్ష ఒకవెయ్యి నూటపదహారు రూపాయలు విరాళంగా అందజేశారు.

జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి చేతులమీదుగా 101116 రూపాయలు సర్పంచ్‌ నాయుడు రామారావుకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు నందిపేట మండల అభివద్ధి అధికారి నాగవర్థన్‌, ఇతర అధికారులు, గ్రామ పెద్దలు గింజుపల్లి వెంకటనారాయణ, నాయుడు లక్ష్మీనారాయణ, భానుప్రకాష్‌, కిషన్‌రెడ్డి, కళ్యణచక్రవర్తి, యలవర్తి రమేష్‌, రైతు సంఘం నాయకులు కాపు వినయ్‌, నాయుడు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *