Breaking News

జిల్లాను జీరో వేస్ట్‌ కాన్సెప్ట్‌ వైపు తీసుకెళ్లడమే లక్ష్యం

నిజామాబాద్‌, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని రకాల వధాను తిరిగి ఉపయోగించి జిల్లాను జీరో వేస్ట్‌ పైపు తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ‘మన ఆకాశవాణి మన నిజామాబాద్‌’ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక రేడియో స్టేషన్లో ప్రజలతో మాట్లాడారు.

ఈ నెల 2 నుండి 12 వరకు నిర్వహించిన రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని, గ్రామాలన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా స్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, నర్సరీలు ప్రతి గ్రామంలో ప్రారంభించడంతో పాటు ఇంటింటికి ఇంకుడు గుంతలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

దానితోపాటు ఆయా గ్రామాల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, మోరీలు శుభ్రం చేయడం, చెత్తను ఎత్తడం ఇంటింటి నుండి చెత్తను సేకరించి ప్రతి ఇంటికి చెత్త బుట్టలను అందించడం, వీధులను శుభ్రం చేయించడం, పాత ఇళ్లను కూల్చడం, పనికిరాని బావులను పూడ్చి వేయడం తదితర కార్యక్రమాల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున వారి వంతుగా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వివరించారు.

ఆయా గ్రామాల్లో చదివి, మంచి స్థితిలో ఉన్న గ్రామస్థుల నుండి వారి పాఠశాల, గ్రామాల అభివద్ధికి విరాళాలు అందించవలసిందిగా జిల్లా యంత్రాంగం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని ఇందుకుగాను రూ. 1.61 కోట్ల నగదుతో పాటు 75 లక్షల విలువచేసే వస్తువులను విరాళంగా అందించారని తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలలో భాగస్వాములు కావడం గొప్ప విషయమన్నారు.

ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్తపై ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా వేరువేరుగా సేకరించడానికి జిల్లా యంత్రాంగం ఆలోచిస్తుందని, చెత్తను డంపింగ్‌ యార్డులలో వేరువేరుగా ప్రోగు చేసి తడి చెత్తను కంపోస్ట్‌ ఎరువుగా తయారుచేయడానికి పొడి చెత్త లోని ఇనుము, సీసం, ప్లాస్టిక్‌ తదితర వధా లను రీసైక్లింగ్‌ చేయించడం ద్వారా ఆయా గ్రామాలు జీరో వేస్ట్‌గా రూపొందడానికి అవకాశం కలుగుతుందన్నారు.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అన్ని గ్రామాలలో పచ్చదనం వెల్లివిరిసేలా పూర్తిస్థాయిలో మొక్కలను నాటి వాటిని సంరక్షించడానికి వాటికి రెగ్యులర్‌గా నీటిని అందించడానికి అన్ని గ్రామాల్లో ట్రాక్టర్లు, ట్రైలర్లు, ట్యాంకర్లను అందిస్తున్నామని, ఇప్పటివరకు 180 గ్రామాల్లో వీటిని సమకూర్చడం జరిగిందని వివరించారు. మిగతా గ్రామాల్లో కూడా వీటిని సమకూర్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఒక్క యంత్రాంగం మాత్రమే పని చేస్తే సరిపోదని ప్రజల సహకారం ఉన్నప్పుడే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని ప్రజలకు ఇలా చెప్పడంలో భాగంగా భవిష్యత్తు తరాల క్షేమాన్ని, ఆరోగ్యాలను దష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటిలో ప్రతి గ్రామంలో మొక్కలను నాటించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా సమతుల వాతావరణం పెంపొంది వేడి తగ్గుతుందని వర్షాలు కురుస్తాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మొక్కల పెంపకం ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయని అన్నారు. అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలలో విద్యా సంస్థలలో అక్కడికి వచ్చే ప్రజలకు కనీసం త్రాగునీరు, టాయిలెట్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత అందరు కూడా కార్యక్రమాల్లో పాలుపంచుకొని వారి వంతుగా విరాళాలు అందించాలని గ్రామాలను పాఠశాలలను అభివద్ధి చేసుకోవాలని ఆయన కోరారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *