విద్యార్థి నాయకుడు రంగు సీతారాం

నిజామాబాద్‌, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 27డివిజన్‌ ఆనంద్‌ నగర్‌లో తెరాస కార్పొరేటర్‌ అభ్యర్థి రంగు సీతారాం సోమవారం స్థానిక ప్రజలతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రంగు సీతారాం విద్యార్థి దశనుంచే ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సైనికునిలా పనిచేశారని పేర్కొన్నారు.

సీతారాం లాంటి యువతకు, చదువుకున్న వారికి ఓటు వేసి గెలిపించాలని అప్పుడే డివిజన్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదలకు అండగా ఉంటుందన్నారు.

తనను రెండు సార్లు నిజామాబాద్‌ ప్రజలు ఆదరించారని, అలాగే రంగు సీతారాంకు అవకాశం కల్పించి డివిజన్‌ సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సుమారు 300 మంది మహిళలు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *