పల్లె ప్రగతి పనులు కొనసాగించాలి

రెంజల్‌, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులను ఎప్పటికి కొనసాగించాలని మండల అభివృద్ది అదికారి గోపాలకృష్ణ అన్నారు. మండల పరిసత్‌ కార్యాలయంలో సోమవారం సర్పంచ్‌లు, కార్యదర్శులు, పీల్డ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ముమ్మరంగా నిర్వహించారని తెలిపారు.

అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పదకొండు రోజులుగా గ్రామాల్లో అనేక సమస్యలను పరిష్కరించారని, మిగిలిన పనులు యథాతథంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని గోపాలకృష్ణ సూచించారు. మండలంలో ప్రత్యేకంగా కిసాన్‌ తాండా, దండి గుట్ట, వీరన్నగుట్ట, అంబేడ్కర్‌ నగర్‌, మౌలాలి తండా, పేపర్‌ మిల్‌ గ్రామాల్లో వైకుంఠ ధామాల ఏర్పాటుకు భూమిపూజ చేయడం జరిగిందన్నారు.

ఆరు గ్రామాల్లోని నిర్మాణ పరిస్థితులను గ్రామ సర్పంచ్‌, కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైతే నిర్మాణ పనులు ప్రారంభం కాలేదో త్వరితగతిన ప్రారంభించాలని ఎంపిడివో సూచించారు. కమ్యూనిటి మరుగుదొడ్ల నిర్మాణ పనులు అన్ని గ్రామాల్లో చేయాల్సిన అవసరముందని చెప్పారు. నాటిన మొక్కలకు ఎక్కడైతే ట్రీ గార్డులు ఏర్పాటు చేయలేదో అక్కడ సర్పంచ్‌ల సహాయంతో ఖచ్చితంగా వాటిని సంరక్షించే ఏర్పాటు చేయాలని సూచించారు.

అందుకు క్షేత్ర సహాయకులు ప్రత్యేక శ్రద్ద వహించాల్సి వుంటుందన్నారు. లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో వెనకాడేది లేదని స్పష్టం చేశారు. గ్రామాల్లోని కాలనీల్లో మురికి కాలువలు, రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు గ్రహించాలని ఎంపిడివో కార్యదర్శులను ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో ఎంపివో గౌస్‌ మోయినోద్దీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ట్రాన్స్‌కో ఎ.ఇ, సర్పంచ్‌లు శనిగరం సాయారెడ్డి, వెకార్‌ పాషా, ఖలీం బేగ్‌, సాయిలు, రమేశ్‌ కుమార్‌, రాజు, లలిత రాఘవేందర్‌, విజయ, నిరంజని, శ్రీదేవి, సునీత, కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు ఉన్నారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *