Breaking News

Daily Archives: January 14, 2020

ఎన్నికల విధుల్లో అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్‌

కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17వ తేదీన కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ ఆర్ట్స్‌ సైన్స్‌ కాలేజీలో, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి మోడల్‌ డిగ్రీ కాలేజీలో, బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించి ఎస్‌ఆర్‌ఎన్‌కె డిగ్రీ కాలేజ్‌లో పి.ఓ., ఏపీఓ లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, ...

Read More »

ఎల్లారెడ్డి పురపాలక తెరాస అభ్యర్థులు వీరే

నిజాంసాగర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పురపాలన వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులను మంగళవారం ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ ప్రకటించారు. చివరి రోజు నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగియడంతో ఎల్లారెడ్డి పురపాలక సంఘంలో 12 వార్డులకు సంబంధించిన పోటీ అభ్యర్థులను ప్రకటించి వారికి బీ-ఫారాలు అందజేశారు. తెరాస అభ్యర్థులు వీరే : 1వవార్డు-అల్లం శ్రీను, 2వ వార్డు-తుమ్మల గాయత్రి, 3వ వార్డు-జీనిత్‌ సుల్తానా, 4వ వార్డు-ఎరుకల సాయిలు, 5వ వార్డు-ముస్థ్యల సుజాత, 6వ వార్డు-మేకకోటి కమలమ్మ, 7వ వార్డు-కుడుముల సత్యం, ...

Read More »

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఎస్‌.ఆర్‌.ఎన్‌.కె. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎన్నికల రిసెప్షన్‌ కౌంటర్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ సెంటర్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ పరిశీలించారు. కౌంటింగ్‌ సెంటర్ల ఏర్పాటులో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు, పోలీస్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డివో రాజేశ్వర్‌, డి.ఎస్‌.పి. దామోదర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి, సీఐ మహేష్‌ గౌడ్‌, ...

Read More »

జల విద్యుత్‌ కేంద్రం వద్ద చిరుత సంచారం

నిజాంసాగర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల హెడ్స్‌లూస్‌ జల విద్యుత్‌ కేంద్రం గేట్ల వద్ద 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ప్రాంతంలో చిరుత పులి సంచరించడంతో ప్రజలు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. జల విద్యుత్‌ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న నీటిపారుదల శాఖ ప్రధాన కాలువ గేట్ల ముందు భాగంలో నీరు తాగేందుకు మధ్యాహ్న సమయంలో చిరుతపులి గేట్ల వద్ద సంచరిస్తుందని, దీంతో ప్రజలు, ఉద్యోగస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ ...

Read More »

జిల్లా ప్రజలకు కలెక్టర్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటే భోగభాగ్యాలు అని, భోగి మంటలు అని, పాడిపంటలు అని, ముగ్గులు, మురిపాలు అని పేర్కొన్నారు. పండుగ రోజున ప్రతి ఇంటి ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులతో ఎంతో అందంగా తీర్చిదిద్దుతారని, ఎక్కడ చూసినా ప్రకతి శోభ ఆహ్లాద కరంగా కనిపిస్తుందని అన్నారు. ప్రతి మహిళ నోములు, పసుపు బొట్లతో ఆనందంగా బిజీగా గడుపుతారని తెలిపారు. పండుగను ప్రతి ...

Read More »

సీతారాం వెంటే ఉంటా…

నిజామాబాద్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేరు సంఘం పట్టణ సంయుక్త కార్యదర్శి కొట్టురు పార్థసారథి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా 27డివిజన్‌లో నామినేషన్‌ వేశారు. విద్యార్థి నాయకుడు, మనసున్న మనిషి రంగు సీతారాం తోడుండాలని నిర్ణయించుకొని మంగళవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని తెరాసలో చేరారు. 27వ డివిజన్‌ తెరాస పార్టీ అభ్యర్థీ రంగు సీతారామ్‌కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేరు సంఘం అధ్యక్షులు కొట్టూర్‌ చంద్రకాంత్‌, ...

Read More »

గులాబి గాలిపటం ఎగరేసిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల గణేశ్‌ గుప్త సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కోటగల్లి, డివిజన్‌ 48లో మార్కండేయ మందిరం ఎదురుగా సంక్రాంతి సందర్భంగా యువకులతో కలిసి గులాబీ రంగు గాలిపటం ఏగరవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్‌ పట్టణ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండాయని, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ...

Read More »