Breaking News

సీతారాం వెంటే ఉంటా…

నిజామాబాద్‌, జనవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేరు సంఘం పట్టణ సంయుక్త కార్యదర్శి కొట్టురు పార్థసారథి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా 27డివిజన్‌లో నామినేషన్‌ వేశారు. విద్యార్థి నాయకుడు, మనసున్న మనిషి రంగు సీతారాం తోడుండాలని నిర్ణయించుకొని మంగళవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని తెరాసలో చేరారు.

27వ డివిజన్‌ తెరాస పార్టీ అభ్యర్థీ రంగు సీతారామ్‌కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేరు సంఘం అధ్యక్షులు కొట్టూర్‌ చంద్రకాంత్‌, గాండ్ల లింగం, అనిల్‌ రావు, గోపాల్‌, మారుతీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏబీవిపి ఆధ్వర్యంలో గుడ్లు, బిస్కెట్లు పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *