Breaking News

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఎస్‌.ఆర్‌.ఎన్‌.కె. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎన్నికల రిసెప్షన్‌ కౌంటర్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ సెంటర్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ పరిశీలించారు.

కౌంటింగ్‌ సెంటర్ల ఏర్పాటులో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు, పోలీస్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డివో రాజేశ్వర్‌, డి.ఎస్‌.పి. దామోదర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి, సీఐ మహేష్‌ గౌడ్‌, మున్సిపల్‌ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Check Also

వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను త్వరితగతిన పూర్తిచేయాల‌ని ...

Comment on the article