జల విద్యుత్‌ కేంద్రం వద్ద చిరుత సంచారం

నిజాంసాగర్‌, జనవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల హెడ్స్‌లూస్‌ జల విద్యుత్‌ కేంద్రం గేట్ల వద్ద 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ప్రాంతంలో చిరుత పులి సంచరించడంతో ప్రజలు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.

జల విద్యుత్‌ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న నీటిపారుదల శాఖ ప్రధాన కాలువ గేట్ల ముందు భాగంలో నీరు తాగేందుకు మధ్యాహ్న సమయంలో చిరుతపులి గేట్ల వద్ద సంచరిస్తుందని, దీంతో ప్రజలు, ఉద్యోగస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతపులి జనాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *