గులాబి గాలిపటం ఎగరేసిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జనవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల గణేశ్‌ గుప్త సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కోటగల్లి, డివిజన్‌ 48లో మార్కండేయ మందిరం ఎదురుగా సంక్రాంతి సందర్భంగా యువకులతో కలిసి గులాబీ రంగు గాలిపటం ఏగరవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్‌ పట్టణ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంవత్సరం పంటలు బాగా పండాయని, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. సాంప్రదాయ పండగలను మర్చి పోకుండా ప్రతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి మెలసి సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పద్మశాలి సంఘం సభ్యులు, తెరాస కార్యకర్తలు ఉన్నారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *