ఎన్నికల విధుల్లో అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్‌

కామారెడ్డి, జనవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 17వ తేదీన కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ ఆర్ట్స్‌ సైన్స్‌ కాలేజీలో, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి మోడల్‌ డిగ్రీ కాలేజీలో, బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించి ఎస్‌ఆర్‌ఎన్‌కె డిగ్రీ కాలేజ్‌లో పి.ఓ., ఏపీఓ లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, అక్కడే ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్‌, ఐడీ కార్డు చూపించి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. అలాగే ఓ.పి.ఓ. విధులలో (ఇతర పోలింగ్‌ సిబ్బంది) ఉన్న సిబ్బంది తాము ఓటు హక్కు కలిగిన మున్సిపల్‌ కార్యాలయంలో తమ ఎన్నికల ఆర్డర్‌ కాపీ, ఐ.డి. కార్డు చూపి పోస్టల్‌ బ్యాలెట్‌ పొందాలని, అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్స్‌లో తమ ఓటు వేయాలని తెలిపారు.

ఈనెల 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ పొందాలని, 21 వ తేదీ వరకు డ్రాప్‌ బాక్స్‌లో వేయాలని తెలిపారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *