జిల్లా ప్రజలకు కలెక్టర్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, జనవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటే భోగభాగ్యాలు అని, భోగి మంటలు అని, పాడిపంటలు అని, ముగ్గులు, మురిపాలు అని పేర్కొన్నారు. పండుగ రోజున ప్రతి ఇంటి ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులతో ఎంతో అందంగా తీర్చిదిద్దుతారని, ఎక్కడ చూసినా ప్రకతి శోభ ఆహ్లాద కరంగా కనిపిస్తుందని అన్నారు.

ప్రతి మహిళ నోములు, పసుపు బొట్లతో ఆనందంగా బిజీగా గడుపుతారని తెలిపారు. పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోష వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నానని, భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు సిరి సంపదలు అందించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

అదేవిధంగా 11 రోజులపాటు నిర్వహించిన రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలలో తమ వంతుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలియజేశారు. వారి వారి గ్రామాలు, పాఠశాలల అభివద్ధికి ఇదేవిధంగా కలిసి రావాలని ఆయన ప్రకటనలో కోరారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *