Breaking News

Daily Archives: January 16, 2020

సంఘటిత సమాజమే దేశానికి శ్రీరామ రక్ష

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయులందరం విభేదాలు మరచి కలిసి ఉంటేనే ఈ దేశం మళ్ళీ విశ్వగురువు స్థానంలోకి చేరుతుందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ జిల్లా సంఘచాలకులు కాపర్తి గురుచరణం అన్నారు. స్వర్గీయ మేజర్‌ హర్భజన్‌ సింగ్‌ పేరుతో నడుస్తున్న బోర్గం శాఖ వార్షికోత్సవం గురువారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో గురుచరణం ప్రధానవక్తగా విచ్చేసి మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక దక్కన్‌ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ మాల్యాల శ్రీపాద హాజరయ్యారు. వారు మాట్లాడుతూ భారతీయులను దేశభక్తులుగా తయారుచేస్తున్న గొప్ప ...

Read More »

తెరాస మూడో స్థానానికే పరిమితమవుతుంది

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలలో తెరాస మూడోస్థానానికే పరిమితమవుతుందని నిజామాబాదు ఎంపి అర్వింద్‌ ధర్మపురి జోస్యం చెప్పారు. గురువారం బస్వాగార్డెన్స్‌లో జరిగిన బిజెపి నిజామాబాదు అభ్యర్థుల సమావేశంలో అర్వింద్‌ మాట్లాడుతూ ఎన్నికలలో బిజెపి ఎంఐఎం పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. ఎంఐఎంకు మేయర్‌ పీఠంపై కూర్చోబెట్టేందుకే మెజారిటీ డివిజన్లలో తెరాస డమ్మీ అభ్యర్థులను నిలిపిందని ఆరోపించారు. తెరాసకు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్టేనన్నారు.

Read More »

అభివృద్ధి చేశారా? ఓట్లు అడుగుతున్నారు

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హల్‌లో మాజీ మంత్రి షబ్బిర్‌ అలీ గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అయోమయ పరిస్థితిలో ఉందని, రైతు బంధు లేదు, మిషన్‌ భగీరథ లేదు, మిషన్‌ కాకతీయ లేదు, నిరుద్యోగ యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భతి లేదని, సర్కారు ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతుందని పేర్కొన్నారు. సెక్రటరియేట్‌ లేదు, మంత్రులకు కేటాయించిన కార్యాలయం మంత్రులకే తెలియకుండాపోయిందని ఎద్దేవా చేశారు. ఏం అభివద్ధి చేశారని మళ్లీ ప్రజల ...

Read More »

అత్త మామలపై కత్తితో దాడిచేసిన అల్లుడు

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరుకు చెందిన జోర్రిగల, శోభ దంపతులపై అల్లుడు గోపాల్‌ కత్తితో దాడి చేశాడు. గత కొద్ది రోజులుగా గోపాల్‌ భార్య స్వప్న తల్లిగారింటివద్ద భిక్కనూర్‌లో ఉంటుంది. భార్యాభర్తల మధ్య గోడవలతో గోపాల్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అత్తమామలపై కక్ష పెంచుకోవడంతో గోపాల్‌ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి బాధితులను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

Read More »

భక్త జన సందోహం – కూనేపల్లి సాయి మందిరం

రెంజల్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలో సాయిబాబా మందిరం వద్ద గురువారం భక్తజన సందోహం కనిపించింది. ఇక్కడ ప్రతి గురువారం భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేపడతారు. కూనేపల్లి గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలైన బాగేపల్లి, దండిగుట్ట, కల్యాపూర్‌, నవీపేట్‌, కిసాన్‌ తాండా తదితర గ్రామాల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుంటారు. గత పద్దెనిమిది వారాల నుండి ఆలయం వద్ద భక్తులు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం సర్పంచ్‌ ...

Read More »

అంగన్‌వాడిలు సమయపాలన పాటించాలి

రెంజల్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కార్యకర్తలు ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో పనిచేయాలని సూపర్‌వైజర్‌ ప్రమీలరాణి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అంగన్‌వాడి కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. కేంద్రాల్లోకి వస్తున్న చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు కార్యకర్తలు నిత్యం అందిస్తున్న పోషక ఆహారంపై సూపర్‌వైజర్‌ ఆరాతీశారు. పిల్లలకు బోధన, ఆటపాటలు ఏ మేరకు నేర్పుతున్నారనేది దగ్గరుండి గమనించారు. ఎల్‌కెజి, యుకెజి పిల్లలకు ప్రభుత్వం అందజేసిన పుస్తకాలపై కార్యకర్తల బోధనను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రీ స్కూల్‌ పిల్లలకు ...

Read More »

తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ

రెంజల్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్‌ సునీత తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. గ్రామంలోని ఇంటింటికి బుట్టలు అందజేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీనిని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేసుకోవడం జరిగిందని తెలిపారు. పల్లె ప్రగతిని నిరంతరం కొనసాగిస్తే గ్రామాలు ఎప్పటికి సస్యశ్యామలంగా ఉంటాయని సర్పంచ్‌ స్పష్టం చేశారు. ప్రజలు ...

Read More »

ఎన్నికల ఫిర్యాదులు 7901530911 నెంబర్‌కు చేయండి

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే తన మొబైల్‌ నెంబర్‌ 7901530911 కు కాల్‌ చేయాలని జిల్లాకు నియమించబడిన మున్సిపల్‌ ఎన్నికల సాధారణ పరిశీలకులు ముషారఫ్‌ ఫరూకి తెలిపారు. గురువారం ప్రగతి భవన్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు తనిఖీ బందాలతో ఏర్పాటుచేసిన సమావేశం సందర్భంగా ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తన నంబర్‌ను ఇచ్చి ఎన్నికల నిబంధనలు ఎక్కడ అతిక్రమణ జరిగినా ఇతర ఫిర్యాదులు ఉన్నా తనకు కాల్‌ చేయాలని ...

Read More »

వచ్చే రోజులు కీలకం

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఇకముందు అన్ని రోజులు కూడా కీలకమేనని, అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సాధారణ పరిశీలకులు ముషారఫ్‌ ఫరూక్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ప్రకారం ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని నామినేషన్ల ప్రక్రియ నిబంధనలు ప్రకారం పూర్తయిందని తెలిపారు. ఇక ప్రచారం, పోలింగ్‌, ...

Read More »

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నిజాంసాగర్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం కోమలంచ గ్రామానికి చెందిన బ్యాగరి సాయిలుకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 24 వేల 500 రూపాయల చెక్కును మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు సాధుల సత్యనారాయణ, సిడిసి చైర్మన్‌ గంగారెడ్డి , మండల కో ఆప్షన్‌ సభ్యుడు ఇస్మాయిల్‌లు అందజేశారు. అనంతరం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ పేదల ఆపద్బాంధవుడు కెసిఆర్‌ అని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ సంతోష్‌, తెరాస గ్రామ అధ్యక్షుడు బిట్టు ఉపాద్యకుడు గంగారాం, గ్రామస్తులు ...

Read More »

భీమ్‌గల్‌లో ఈరవత్రి అనిల్‌ ఎన్నికల ప్రచారం

భీమ్‌గల్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో గురువారం బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భీంగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 2వ డివిజన్‌ అభ్యర్థి నరసయ్య, 10 వ డివిజన్‌ అభ్యర్థి లత నరసయ్య, 5 వ డివిజన్‌ అభ్యర్థి బొదిరే స్వామి, 6వ డివిజన్‌ అభ్యర్థి సుధాకర్‌ల తరఫున అనిల్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.

Read More »

19న ఉపాధ్యాయ సంఘాల ఐక్యత సదస్సు

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల ఐక్యత సదస్సుకు సంబంధించిన పోస్టర్లను టిపిటిఎఫ్‌, టిటిఎఫ్‌ నాయకులు గురువారం నిజామాబాదులో ఆవిష్కరించారు. టిటిఎఫ్‌ ,టిపిటిఎఫ్‌, టిడిటిఎఫ్‌ సంఘాలు కలసిపోవడం శుభపరిణామమని ఈ సందర్భంగా సంఘాల నాయకులన్నారు. ఐక్యత సదస్సును జిల్లాలోని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సురేష్‌, సత్యనారాయణ, దేవి సింగ్‌, పవన్‌, లింగం చందర్‌, స్వామి, ఇబ్రహీం, లింగయ్య, సురేష్‌, వెంకట్రావు, రమేష్‌ బాబు, నాగమణి పాల్గొన్నారు.

Read More »

మేదరి సంఘ భవనాలకు నిధులు మంజూరు

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువరం రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పలు గ్రామాలకు అభివృద్ధి పనుల కొరకు నిధులు విడుదల చేశారు. జక్రాన్‌పల్లి సంఘానికి 4 లక్షలు, అర్గుల్‌ సంఘానికి 3 లక్షలు సంఘాల భవన నిర్మాణాల కొరకు నిధులు విడుదలచేస్తూ ఉత్తర్వుల పత్రాలు మేదరి సంఘం జిల్లా అధ్యక్షులు దర్శనం దేవేందర్‌కు అందజేశారు. మేదరులను గుర్తించి నిధులు విడుదల చేసినందుకు జిల్లా సంఘం తరపున ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ధన్యవాదములు తెలిపారు. అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు ...

Read More »

ఫిబ్రవరి 2న రన్‌ ఫర్‌ ఎ గర్ల్‌ చైల్డ్‌

హైదరాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి సహకారంతో మురికివాడల్లోని 10 వేల మంది పేద బాలికలను చదివించి ఉత్తమ విద్యార్థినులుగా తీర్చిదిద్దటానికి సేవా భారతి నడుంబిగించింది. గత మూడు సంవత్సరాలుగా రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రస్తుతం 5 వేల 348 బాలికలను చదివిస్తోంది. ఈ సంవత్సరం రన్‌ ఫర్‌ ఎ గర్ల్‌ చైల్డ్‌ ఫిబ్రవరి 2వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. ఇందులో అందరు భాగస్వాములు కావాలని కోరారు. ...

Read More »

విదేశాల్లో ఉన్నత విద్యకు ప్రభుత్వ సహాయం

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబాఫూలే బి.సి ఓవర్సీస్‌ విద్యా నిధి పథకం క్రింద విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 15వ తేదీ. ఇందుకోసం దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పి.జి, పి.హెచ్‌.డి చదవాలనుకుంటున్న బి.సి, ఈ.బి.సి విద్యార్థులకు 2019-20 విద్యాసంవత్సరంలో విదేశాల్లో ఉన్నత చదువు కోసం రెండు విడతల్లో రూ. 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ రూపంలో అందజేస్తుంది. ఈ పథకం క్రింద 35 ఏళ్ళ ...

Read More »