కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

కామారెడ్డి, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ 49, 42, 41, 18 వార్డులలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో అభివద్ధి శూన్యమని,

కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీ పూర్తిగా అవినీతి మయమైందన్నారు.

ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపల్‌ కౌన్సిలర్‌ టాక్స్‌ కట్టాల్సి వస్తుందని, ఎంతో కష్టపడి తాను నీళ్ళు తీసుకు వస్తే నల్ల ఇవ్వడానికి ప్రతి ఇంటి నుండి రెండు వేల రూపాయలు లంచం అడుగుతున్నారని తెలిసిందన్నారు. దయచేసి గమనించండి, ఇలాంటి అవినీతిపరులను గెలిపించుకుంటే జీవితకాలంలో కామారెడ్డి ఎప్పుడు కూడా అభివద్ధి కాదని షబ్బీర్‌ పేర్కొన్నారు. 20 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌లో అప్లికేషన్‌ వస్తే ఒక వంద ఇండ్లు కట్టి ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు.

ఏదైనా అభివద్ధి జరిగింది అంటే కాంగ్రెస్‌ పార్టీ హయంలోనేనని షబ్బీర్‌ అలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో 5 వేల ఇండ్లు కట్టి ఇచ్చిన ఘనత తమదేనన్నారు. ప్రతి వార్డును గమనిస్తుంటే డ్రైనేజ్‌ కానీ, రోడ్లు కానీ తమ హయాంలోనాటివేనని, నల్లాలు కూడా తమ హయాంలో బిగించినవేనని చెప్పారు. టిఆర్‌ఎస్‌ హయాంలో అవినీతి మాత్రమే జరగిందని, టిఆర్‌ఎస్‌ కౌన్సిల్‌ర్లు మాత్రమే అభివద్ధి చెందారని, ఆరు బంగ్లాలు, మూడు కార్లతో వర్ధిల్లుతున్నారని ఎద్దేవా చేశారు.

ఈసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అక్రమంగా సంపాదించిన ధనంతో ఓట్లు కొనడానికి వస్తున్నారు, జాగ్రత్త వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోండి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయండి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలనను తాను ముందు వుండి నడిపిస్తానన్నారు. ప్రచారంలో షబ్బీర్‌ అలీతో పాటు ఎంజి వేణు గోపాల్‌ గౌడ్‌, ఫిరంగి రాజేశ్వర్‌, అన్వర్‌ మీర్‌, ఇంతియాజ్‌ అలీ, మహమద్‌ సిరాజ్‌, పండ్ల రాజు, పంపరి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *