Breaking News

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ఎన్నికల విధులు నిర్వహించే మైక్రో అబ్జర్వర్‌లకు స్థానిక ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల కంటే మునిసిపల్‌ ఎన్నికల పరిధి చిన్నగా ఉంటుందని, స్థానిక అభ్యర్థులు బరిలో ఉంటారని నిశిత పరిశీలన ఉంటుందని తెలిపారు. అందువల్ల ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఎన్నికల నిబంధనలకు లోబడి విధులు నిర్వహించవలసి ఉంటుందని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా అసెంబ్లీ పోలింగ్‌ కేంద్రాలు వేరుగా ఉంటాయని, మునిసిపల్‌ ఎన్నికలలో వార్డుల వారీగా ఓటర్ల విభజించబడతాయని, తద్వారా ఓటర్లు గందరగోళానికి గురికాకుండా వారికి వివరించవలసి ఉంటుందన్నారు. మార్కుడు ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వారిని ఓటింగుకు అనుమతించాలని తెలిపారు. వాటితో పాటు శాంతిభద్రతల సమస్యలు కూడా నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరు విధులు నిర్వహించవలసి ఉంటుందని సూచించారు.

నిజామాబాద్‌ ఎంపీడీవో సంజీవ్‌ కుమార్‌ వారికి శిక్షణ అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి అంజయ్య, సూక్ష్మ పరిశీలకులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *