Breaking News

Daily Archives: January 19, 2020

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో ఆదివారం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఆదివారం అర్సపల్లిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనుగుణంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 19వ తేదీన మిస్‌ అయిన పిల్లలందరికీ 20, 21 తేదీలలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరు కవర్‌ అయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ...

Read More »

ఈనెల 20న 5 గంటల లోపు ప్రచారం ముగించాలి

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికలు ఈ నెల 22న జరగనున్నందున అభ్యర్థులు పార్టీల ప్రతినిధులు 20వ తేదీన సాయంత్రం ఐదు గంటల లోపు ప్రచారాన్ని ముగించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ యొక్క ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నందున 20వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత సమావేశాలు కానీ, ర్యాలీలు కానీ, మైకులతో ప్రచారం కానీ నిర్వహించవద్దని, పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ పార్టీల ...

Read More »

18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపించి ఓటు వేయవచ్చు

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికలలో ఓటర్‌ స్లిప్‌తో పాటు ఎన్నికల కమిషన్‌ సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఒక దానిని చూపి ఓటు వేయవచ్చని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల యంత్రాంగం పంపిణీ చేసిన ఓటర్‌ స్లిప్‌తో పాటు ఓటర్‌ గుర్తింపు కార్డును ఓటు వేసే పౌరులు వెంట తీసుకు రావాలని, ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ప్రత్యామ్నాయంగా మరో 18 గుర్తింపు కార్డులలో దేనినైనా ...

Read More »

దొంగ ఓట్లకు ప్రయత్నిస్తే క్రిమినల్‌ కేసులు

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలలో ఎవరైనా దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు వేయడానికి ప్రణాళికలు చేసుకుంటున్నట్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు వస్తున్నాయని, ఎట్టిపరిస్థితిలోనూ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రకటనలో కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ దిశగా జిల్లా యంత్రాంగం అధికారులను అప్రమత్తం చేసిందని, ...

Read More »