Breaking News

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో ఆదివారం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఆదివారం అర్సపల్లిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనుగుణంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

19వ తేదీన మిస్‌ అయిన పిల్లలందరికీ 20, 21 తేదీలలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరు కవర్‌ అయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఇతర ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే వారికి కూడా పోలియో చుక్కలు వేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం, మెడికల్‌ ఆఫీసర్‌ ఖాజా రారిఫుద్దీన్‌, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *