Breaking News

ఈనెల 20న 5 గంటల లోపు ప్రచారం ముగించాలి

నిజామాబాద్‌, జనవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికలు ఈ నెల 22న జరగనున్నందున అభ్యర్థులు పార్టీల ప్రతినిధులు 20వ తేదీన సాయంత్రం ఐదు గంటల లోపు ప్రచారాన్ని ముగించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ యొక్క ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నందున 20వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత సమావేశాలు కానీ, ర్యాలీలు కానీ, మైకులతో ప్రచారం కానీ నిర్వహించవద్దని, పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరు పాటించాలని ప్రకటనలో కలెక్టర్‌ తెలిపారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *